బహిరంగ సభలు పెడితే లేపేస్తాం.. నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు చెన్నైలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇకపై బహిరంగ సభలు నిర్వహిస్తే విజయ్ ఇంటిని బాంబు పెట్టి లేపేస్తామని ఓ ఆగంతుకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నీలాంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. కన్యాకుమారి నుంచి ఓ వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ 100కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవలే కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషాద ఘటన నేపథ్యంలో ఈ బెదిరింపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కరూర్ ఘటన తర్వాత విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మృతుల కుటుంబసభ్యులకు వ్యక్తిగతంగా వీడియో కాల్స్ చేస్తూ పరామర్శిస్తూ.. తాను అండగా ఉన్నానని, త్వరలోనే నేరుగా కలుస్తానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తానని కూడా ఆయన ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై విజయ్ న్యాయపరమైన చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు. కరూర్ ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలని మృతులలో ఒకరైన 13 ఏళ్ల బాలుడి తండ్రి పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Madhya Pradesh: ఓరి బుడ్డోడా.. లక్ అంటే నీదే.. రూ.200లతో 53 లక్షలు కొట్టేశావ్
SSMB29: నాటు నాటు’ను మించేలా.. మహేశ్- ప్రియాంక చోప్రాపై ఫోక్ సాంగ్
డ్యామ్ గేట్లు తెరవటంతో.. ప్రాణాలు తీసిన పిక్నిక్..
పెళ్లి పీటలెక్కుతున్న త్రిష.. పెద్దలు చూసిన సంబంధానికి గ్రీన్ సిగ్నల్
విడాకులతో పార్టీ చేసుకున్న వ్యక్తి పాలతో స్నానం, కేక్ కటింగ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

