Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన జర్నలిస్ట్‌లకు పాక్‌ డిటెక్టివ్‌లు ట్రాప్‌!

మన జర్నలిస్ట్‌లకు పాక్‌ డిటెక్టివ్‌లు ట్రాప్‌!

Phani CH

|

Updated on: May 15, 2025 | 4:08 PM

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరుదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాక్‌ గూఢచారులు మాత్రం భారత రహస్యాలను తెలుసుకోవడానికి దొడ్డిదారిన ప్రయత్నిస్తున్నారు. భారత్ రక్షణ శాఖ అధికారులమని చెప్పుకుంటూ జర్నలిస్ట్‌లకు ఫోన్‌ చేసి ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సంబంధించి సైనిక అధికారులు చేసే బ్రీఫింగ్‌, పాక్‌ విషయంలో చేసే ప్రణాళికలు మొదలైన సమాచారాన్ని సేకరిస్తున్నారని భారత నిఘా వర్గాలు తెలిపాయి.

పాక్‌ దాడిలో భారత్‌లోని ఏయే ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందనే విషయాలపై కూడా వారు ఆరా తీస్తున్నట్లు చెప్పాయి. ఇతర జర్నలిస్టులు, కొందరు పౌరులకు కూడా గూఢచారుల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు సమాచారం. ఈ కాల్స్‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నుంచి వస్తున్నట్లు చూపిస్తున్నాయని.. కానీ, భారత అధికారులెవరూ అటువంటి కాల్స్‌ చేయరని నిఘా వర్గాలు అంటున్నాయి. అటువంటి కాల్స్‌ వస్తే ఆన్సర్‌ చేయొద్దని.. తమకు సమాచారం ఇవ్వాలని సూచించాయి. ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇరుదేశాల ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ డీజీఎంవో ల మధ్య హాట్‌లైన్‌లో చర్చలు జరగనున్నాయి భారత్‌, పాక్‌ చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, త్రివిధ దళాధిపతులు, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమావేశమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడవిలో అడ్డంగా దొరికిన ప్రేమ జంట.. పోలీసులు వెళ్లేసరికి

అనకాపల్లి జిల్లాలో 13 అడుగుల కింగ్ కోబ్రా కలకలం

పురుషులకు ఈ మొక్క ఓ వరం.. కనిపిస్తే వదలకండి..!

వేసవిలోనూ అల్లం టీ తాగుతున్నారా..?

వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి