Badam Benefits : బాదంతో భారతీయులకు అధిక మేలు వీడియో
అదేంటి బాదం భారతీయులకు తప్ప ఇతర దేశాల వారికి మంచిది కాదా అనుకుంటున్నారా అది కాదండి ప్రకృతి నుంచి లభించేది ఏదైనా అన్ని దేశాల వారికి మంచిదే అయితే భారతీయులకు ఈ బాదం వల్ల మరిన్ని మేలు జరుగుతుందని అంటున్నారు. నిపుణుల ప్రకారం భారతీయులు రోజు బాదం పప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుందట
అంతేకాదు మధుమేహం వచ్చే లక్షణాలు ఉన్నవారు కూడా రోజు బాదం తింటే జీవక్రియ మెరుగుపడి పరుగుడును చక్కెర స్థాయి హెచ్ బి ఏ వన్ సి తగ్గిపోతాయని ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో తేలిందట. రోజుకు 50 గ్రాముల బాదం పప్పును పోషక విలువలు గల ఆహారంతో కలిపి తింటూ తగిన వ్యాయామం చేస్తే శరీర బరువు అదుపులో ఉంటుందట. ఉదయాన్నే అల్పాహారంగా బాదం లేదా ఓట్ మీల్ తీసుకుంటే ప్రోటీన్లు పీచు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయట. మధ్యాహ్నం సాయంత్రాలలో నూనె పదార్థాలు ఇతర చిరుతిండ్లు తినకుండా బాదం తింటే మంచిదని సూచిస్తున్నారు .వ్యాయామం అనంతరం బాదం తీసుకుంటే కండరాలు బలిష్ఠమవుతాయి రోజూ బాదం తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి డయాస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది. ఉదరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు
'ఖమేనీ'మృతితో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశం
ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే
కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల..
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

