AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే

నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే

Ch Murali
| Edited By: Phani CH|

Updated on: Dec 01, 2025 | 9:57 PM

Share

నెల్లూరు నగరంలో ఇటీవల వరుస హత్యలు, దాడులు, గంజాయి విక్రయాలతో రౌడీలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నేరాలు జరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి కఠిన చర్యలు చేపట్టారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, నగరంలో ప్రదర్శనలు నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసుల ఈ వినూత్న చర్యలు వైరల్‌గా మారాయి.

నెల్లూరు నగరంలో ఇటీవల రౌడీలు రెచ్చిపోతున్నారు.. పట్ట పగలే దాడులు, హత్యలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు.. ఇటీవల కాలంలో వరుస ఘటనలతో నెల్లూరు నగరం ఉలిక్కి పడింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రౌడీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వెరైటీ పనిష్మెంట్ ఇచ్చారు.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి.. ఇటీవల కాలంలో గంజాయి బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి. నగర పరిధిలో గడిచిన ఏడాదిగా వరుస హత్యలు జరిగాయి.. పట్టపగలే నగరం నడబొడ్డున కత్తులతో నరికి చంపిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇటు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి అటు బొడిగాని తోట వరకు రౌడీ బ్యాచ్ లు పేట్రేగిపోతున్నాయి. నగరంలో పలు చోట్ల డెన్ లు ఏర్పాటు చేసుకుని గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నారు.. ఇటీవల ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయించే ముఠాను పోలీసులు వెంబడించగా వారిపైనే దాడులకు పాల్పడ్డారు.. దీంతో పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఇటీవల కాలంలో దాదాపు 20 హత్యలు జరిగాయి.. ఇటీవల రౌడీ షీటర్ శ్రీకాంత్ జైల్లో ఉంటూ అతని ప్రియురాలు నిదిగుంట అరుణ చే సెటిల్మెంట్లు చేయిస్తున్న విషయం వెలుగు చూడటంతో శ్రీకాంత్ పెరోల్ రద్దు చేయడంతో పాటు అరుణ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా గంజాయి విక్రయాలు జరుపుతున్నారని కామాక్షి పై స్థానిక సిపిఎం నేత పెంచలయ్య అడ్డు తగులుతున్న కారణంగా అతనిపై పది మందికి పైగా కత్తులతో నరికి చంపారు.. దీంతో నెల్లూరు నగరంలో జరుగుతున్న వరుస హత్యలు.. ఇక్కడ శాంతి భద్రతల అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెంచలయ్య హత్య కేసులో కామాక్షి సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.. అంతటితో ఆగకుండా నగరంలో ఉన్న రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.. రౌడీలతో నగరంలో ప్రదర్శన నిర్వహించిన చిన్న బజార్ పోలీసులు ఇటీవల జరుగుతున్న హత్యలు, దాడుల నేపథ్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రదర్శన నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.. దీంతో నేరం చెయ్యాలన్న ఆలోచన వస్తె ఎలాంటి చర్యలు ఉంటాయో అనేది ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇచ్చినట్లు అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Today Gold Price: సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా..!

ఫ్లెమింగో ఒంటి కాలి జపం కథేంటో తెలుసా..?

పొదుపుకు ఉత్తమ సూత్రం.. 50/30/20 రూల్

కప్పు కాఫీ రూ.570లు.. స్పెషలేంటో తెలిస్తే

చలిగా ఉందని కాఫీ, టీ తెగ తాగేస్తున్నారా.. డేంజర్‌

Published on: Dec 01, 2025 09:40 PM