AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లెమింగో ఒంటి కాలి జపం కథేంటో తెలుసా..?

ఫ్లెమింగో ఒంటి కాలి జపం కథేంటో తెలుసా..?

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 9:19 PM

Share

ప్రతి ఏటా రాజస్థాన్‌లోని సాంభర్ ఉప్పునీటి సరస్సుకు భారీ సంఖ్యలో వలస పక్షులు, ముఖ్యంగా ఫ్లెమింగోలు తరలి వస్తాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో రెండున్నర లక్షల ఫ్లెమింగోలు వచ్చాయి. వలస పక్షులు ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి. ఫ్లెమింగోలు ఒంటి కాలిపై నిలబడటం వెనుక ‘రీటా మిరాబిల్‌’ రక్తనాళాలతో కూడిన శాస్త్రీయ కారణం ఉంది.

ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా రాజస్థాన్‌లోని సాంభర్‌ ఉప్పునీటి సరస్సుకు భారీ సంఖ్యలో వలసపక్షులు తరలి వచ్చాయి. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నాయి. ఏటా అక్టోబర్‌ నుంచి మార్చి నెలల మధ్య ఈ సరస్సులో వలస పక్షుల సందడి కొనసాగుతుంది. మొత్తం 300 రకాల పక్షి జాతులు ఇక్కడికి వస్తాయి. ఫ్లెమింగ్‌లతోపాటు రకరకాల బాతులు, ఇతర రకాల పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. వలస పక్షులు వచ్చే ఈ టైమ్‌ పీరియడ్‌లో పర్యాటకులు, ఫొటోగ్రాఫర్‌లు, ప్రకృతి ప్రేమికులు, పక్షి ప్రేమికులు ఇక్కడికి భారీగా వస్తుంటారు. సాంభర్‌ సరస్సు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏటా విదేశాల నుంచి వలస పక్షులు ఇక్కడకు వస్తాయి. ఇక్కడి నదీ జలాల్లో చేపల్ని తింటూ… కొన్ని నెలలు ఇక్కడే ఉంటూ ఇక్కడి చెట్లపై గూళ్లు కట్టుకొని గుడ్లు పెడతాయి. తర్వాత వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. ఆ పిల్లలు కాస్త పెద్దవి కాగానే, వాటిని వెంటబెట్టుకుని మళ్లీ తమ దేశాలకు వెళ్లిపోతాయి. ఈ ఏడాది కూడా అవి భారీగా తరలివచ్చాయి. ఈసారి వర్షాలు భాగా కురవడంతో నీటి వనరు పెరిగి మునుపటి కంటే అధిక సంఖ్యలో వలస పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి.వలస పక్షులతో పోల్చితే ఫ్లెమింగ్‌ పక్షులే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చాయని, ఈసారి సుమారు రెండు నుంచి రెండున్నర లక్షల ఫ్లెమింగో పక్షులు వచ్చినట్లు పక్షి ప్రేమికుడు గౌరవ్‌ దదీచ్‌ తెలిపారు. ప్లెమింగోలు నీటిలో చేపల్ని వేటాడడానికి ఒంటి కాలిపై నిల్చోవడం చూస్తుంటాం. దీనినే కొంగ జపం అంటుంటారు. పక్షులు ఇలా నిల్చోవడం వెనక శాస్త్రీయ విషయం దాగి ఉందని జంతుశాస్త్రవేత్తలు బయటపెట్టారు. పక్షుల కాలి అడుగు భాగంలో ‘రీటా మిరాబిల్‌’ అనే రక్తనాళాలు ఉంటాయి. వీటితో దేహమంతటికి రక్తసరఫరా సజావుగా జరగడంతో పాటు.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. పక్షులు ఆహారం కోసం ఎక్కువ సేపు నీటిలో నిలబడిన సమయంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి జీవక్రియలు మందగిస్తాయి. దీనిని నివారించేందుకు.. కొంగలు నీళ్లలో ఉన్న సమయంలో ఒంటి కాలిపై నిల్చుంటాయి. మరో కాలిని రెక్కల కింద శరీరానికి తగిలేలా ఉంచుకుని శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకుంటాయి. కండరాలశక్తిని ఆదా చేసుకుంటాయి. ఇలా కాళ్లను మారుస్తూ వేటను కొనసాగిస్తాయి అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొదుపుకు ఉత్తమ సూత్రం.. 50/30/20 రూల్

కప్పు కాఫీ రూ.570లు.. స్పెషలేంటో తెలిస్తే

చలిగా ఉందని కాఫీ, టీ తెగ తాగేస్తున్నారా.. డేంజర్‌

పాత “సిమ్ కార్డు” పడేస్తున్నారా? “డాట్” వార్నింగ్‌ ఏంటంటే!

రూ. 100 కోట్ల లగ్జరీ ఇంటిని వీడిన కోటీశ్వరుడు..! ఎందుకంటే