AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కప్పు కాఫీ రూ.570లు.. స్పెషలేంటో తెలిస్తే

కప్పు కాఫీ రూ.570లు.. స్పెషలేంటో తెలిస్తే

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 9:13 PM

Share

చైనా వింత బొద్దింకల కాఫీని పరిచయం చేసింది. ఈ కాఫీని బొద్దింకల పొడి, మీల్‌వార్మ్ పురుగులతో తయారు చేస్తున్నారు. ఇది ప్రొటీన్, మినరల్స్ అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతున్నారు. బీజింగ్‌లోని మ్యూజియం కేఫ్‌లో విక్రయిస్తున్న ఈ డ్రింక్ చైనా యువతలో వైరల్ అవుతోంది. దీని ధర ₹570, రుచి కొద్దిగా పుల్లగా ఉంటుంది.

చాలామందికి కాఫీ అంటే చాలా ఇష్టం. బ్లాక్‌కాఫీ, లెమన్‌ కాఫీ, ఇంకా రకరకాల ఫ్లేవర్లను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలాంటి కాఫీ ప్రియుల కోసం చైనా ఓ కొత్తరకం కాఫీని పరిచయం చేసింది. దీనిగురించి కాఫీ ప్రియుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలియదు కానీ..ఈ కాఫీ మాత్రం మంచి ప్రొటీన్‌, మినరల్స్‌ ఉంటాయట. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందట. ఇంతకీ ఈ కాఫీ దేనితో తయారు చేస్తున్నారో తెలుసా? చైనా రాజధాని బీజింగ్‌లోని ఓ మ్యూజియం ఒక సరికొత్త కాఫీని పరిచయం చేసింది. అదే ‘బొద్దింకల కాఫీ’. వినడానికే వింతగా ఉన్న ఈ కాఫీలో నిజంగానే బొద్దింకల పొడి, ఎండబెట్టిన మీల్‌వార్మ్ పురుగులను కలిపి అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన డ్రింక్ చైనా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడి సాహస ప్రియులైన యువత ఈ కాఫీని టేస్ట్‌ చేయడానికి పోటీపడుతున్నారు. బీజింగ్‌లోని ఒక కీటకాల మ్యూజియంలోని కేఫ్‌లో ఈ ప్రత్యేకమైన కాఫీని విక్రయిస్తున్నారు. దీని ధర 45 యువాన్లు, అంటే భారత కరెన్సీలో సుమారు 570 రూపాయలు. ఈ కాఫీ రుచి కొద్దిగా పుల్లగా ఉంటుందని స్థానిక మీడియా కథనం పేర్కొంది. జూన్ నెల చివర్లో ఈ డ్రింక్‌ను ప్రారంభించినప్పటికీ, ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో దీనికి విపరీతమైన ప్రచారం లభించింది. ఈ కేఫ్‌ సిబ్బంది ఒకరు దీనిగురించి వివరిస్తూ తాము కీటకాలకు సంబంధించిన మ్యూజియం నడుపుతున్నామని, అందుకే తమ థీమ్‌కు తగ్గట్లుగా పానీయాలు ఉండాలని భావించామని, అందుకే ఈ ప్రయోగం చేశామని తెలిపారు. ఈ కాఫీపై యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, అయితే పిల్లలు, వారి తల్లిదండ్రులు మాత్రం దీనికి దూరంగా ఉంటున్నారని వారు వివరించారు. రోజూ 10 కప్పులకు పైగా బొద్దింకల కాఫీ అమ్ముడవుతోందని పేర్కొన్నారు. ఇందులో ఉపయోగించే బొద్దింకల పొడి, ఇతర కీటకాలను భద్రతా ప్రమాణాల కోసం సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ షాపుల నుంచి సేకరిస్తున్నారట. టీసీఎం సూత్రాల ప్రకారం, బొద్దింకల పొడి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, అధిక ప్రొటీన్లు ఉండే మీల్‌వార్మ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని నమ్ముతారు. చైనాలో ఇలాంటి వింత కాఫీ ట్రెండ్‌లు కొత్తేమీ కాదు. ఈ ఏడాది ప్రారంభంలో యునాన్‌లోని ఓ కేఫ్ కాఫీలో వేయించిన పురుగులను కలిపి అమ్మగా, జియాంగ్జీలోని మరో కేఫ్ వేయించిన మిరపకాయలు, కారం పొడితో లాటేలను తయారుచేసి వార్తల్లో నిలిచింది. ఈ కొత్త ట్రెండ్‌లు చైనా కేఫ్ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలిగా ఉందని కాఫీ, టీ తెగ తాగేస్తున్నారా.. డేంజర్‌

పాత “సిమ్ కార్డు” పడేస్తున్నారా? “డాట్” వార్నింగ్‌ ఏంటంటే!

రూ. 100 కోట్ల లగ్జరీ ఇంటిని వీడిన కోటీశ్వరుడు..! ఎందుకంటే

అరుదైన ఈ పువ్వును మీరు ఎప్పుడూ చూసి ఉండరు!

వాష్‌రూమ్‌లో నుంచి భారీ శబ్ధం.. వెళ్లి చూస్తే..అమ్మబాబోయ్‌..