చలిగా ఉందని కాఫీ, టీ తెగ తాగేస్తున్నారా.. డేంజర్
చలికాలంలో అధిక కాఫీ, టీ తాగడం ప్రమాదకరం. వైద్య నిపుణుల ప్రకారం, ఇది శరీరాన్ని త్వరగా డీహైడ్రేషన్ చేస్తుంది, ఎముకలు, కీళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మృదులాస్థిని ఎండబెట్టి, కీళ్లను పెలుసుగా మారుస్తుంది, నొప్పిని కలిగిస్తుంది. కీళ్ల ఆరోగ్యం కోసం తగినంత నీరు త్రాగడం తప్పనిసరి. మామూలుగానే కొంతమందికి కాఫీ, టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది.
మామూలుగానే కొంతమందికి కాఫీ, టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే చలికాలంలో అధికంగా కాఫీ,టీలు అధికంగా తాగుతూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. కాఫీ, టీ, ఇతర వేడి పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం త్వరగా డీ హైడ్రేషన్‌కి గురవుతుందట. అంతేకాదు ఎముకలు, కీళ్లపైన తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. చలికాలంలో వేడి వేడిగా టీ, కాఫీ తాగితే అప్పటికి వెచ్చగా బాగానే ఉంటుంది. కానీ అవి తాగిన తర్వాత ఎముకలను చల్లబరుస్తాయి. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా వాస్తవం. శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి చాలా ఎక్కువ టీ మరియు కాఫీ తాగుతాము. అయితే, అది మన మోకాళ్ల లోపల ఉన్న మృదులాస్థి, రెండు ఎముకల మధ్య ఉండే పొరఎండిపోతుంది. తద్వారా కీళ్లు దృఢంగా అంటే పెలుసుగా మారతాయి. ఎముకలు ఒకదానికొకటి తగిలినప్పుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. శీతాకాలంలో తరచూ కాఫీ,టీలు తాగడంవల్ల శరీరం డీ హైడ్రేషన్‌కి గురవుతుంది. అది కీళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. కాఫీ, టీలు తాగినప్పటికీ తగినంత నీరు త్రాగడం తప్పనిసరి అంటున్నారు. కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం అంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాత “సిమ్ కార్డు” పడేస్తున్నారా? “డాట్” వార్నింగ్ ఏంటంటే!
రూ. 100 కోట్ల లగ్జరీ ఇంటిని వీడిన కోటీశ్వరుడు..! ఎందుకంటే
అరుదైన ఈ పువ్వును మీరు ఎప్పుడూ చూసి ఉండరు!
వాష్‌రూమ్‌లో నుంచి భారీ శబ్ధం.. వెళ్లి చూస్తే..అమ్మబాబోయ్..
ట్రూ-కాలర్ కాదు.. అంతకు మించి.. ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాకే
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

