AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొదుపుకు ఉత్తమ సూత్రం.. 50/30/20 రూల్

పొదుపుకు ఉత్తమ సూత్రం.. 50/30/20 రూల్

Phani CH
|

Updated on: Dec 01, 2025 | 9:16 PM

Share

పెరుగుతున్న ధరల మధ్య డబ్బు పొదుపు కష్టం అనుకుంటే, 50/30/20 ఫార్ములా ఒక పరిష్కారం. ఈ పద్ధతిలో, మీ ఆదాయంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపు/పెట్టుబడులకు కేటాయించాలి. అనవసర ఖర్చులు తగ్గించి, సరైన పెట్టుబడులు ఎంచుకుంటే, ఎవరైనా సులభంగా ఆర్థిక భద్రత సాధించవచ్చు. భవిష్యత్తు అవసరాలకు, కలలకు పొదుపు చేయడం ఇప్పుడు మరింత సులువు.

డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు.. కానీ పొదుపు చేయడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెరిగిపోతున్న ధరల వల్ల ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతోంది. అయితే 50/30/20 ఫార్ములాను అనుసరిస్తే ఎవరైనా.. డబ్బు పొదుపు చేయవచ్చు. ఒక వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే?, ఖర్చులు ఆటోమాటిక్‌గా పెరిగిపోతాయి. ఈ ఖర్చుల కోసం.. సంపాదించిన మొత్తం వెచ్చిస్తే?, భవిష్యత్ కోసం ఏమీ మిగలదు. కాబట్టి పొదుపు అవసరం. 50/30/20 ఫార్ములా.. మీ ఆదాయాన్ని మూడు ఖర్చు భాగాలుగా విభజిస్తుంది. 50 శాతం అవసరాలకు, 30 శాతం సరదా ఖర్చులకు, 20 శాతం పొదుపుకి. వివరంగా చెప్పాలంటే.. మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో 50 శాతం లేదా రూ. 50వేలు అవసరాలకు, అంటే రూమ్ రెంట్, కిరాణా సామాగ్రి, బీమా , ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. 30 శాతం లేదా రూ. 30వేలు సరదా ఖర్చులకు, అంటే.. హ్యాండ్‌బ్యాగులు, గడియారాలు, నగలు వంటివన్న మాట. 20 శాతం లేదా రూ. 20వేలు పొదుపు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి, మీ నైపుణ్యాన్ని బట్టి చేయాలి. ఇలా విభజించుకుంటే.. మీరు తప్పకుండా పొదుపు చేయొచ్చు. మీరు సంపాదించే డబ్బులో ఇంకా కొంత ఎక్కువ పొదుపు చేయాలంటే.. అనవసరమైనవి కొనుగోలు చేయడం లేదా ఖర్చు పెట్టడం మానేయాలి. ఆలా మిగిలిన డబ్బును కూడా మీరు సేవింగ్స్ చేసుకుంటూ పోతే.. పొదుపు తప్పకుండా పెరుగుతుంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే.. దాని గురించి తప్పకుండా కొంత సమాచారం తెలుసుకోవాలి. లేకుంటే నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కప్పు కాఫీ రూ.570లు.. స్పెషలేంటో తెలిస్తే

చలిగా ఉందని కాఫీ, టీ తెగ తాగేస్తున్నారా.. డేంజర్‌

పాత “సిమ్ కార్డు” పడేస్తున్నారా? “డాట్” వార్నింగ్‌ ఏంటంటే!

రూ. 100 కోట్ల లగ్జరీ ఇంటిని వీడిన కోటీశ్వరుడు..! ఎందుకంటే

అరుదైన ఈ పువ్వును మీరు ఎప్పుడూ చూసి ఉండరు!