Rohit Sharma: వరల్డ్ రికార్డ్ కొట్టిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన మ్యాచ్‌లో, హిట్ మ్యాన్ అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. షాహిద్ అఫ్రిదిని అధిగమించి, తన 350వ వన్డే సిక్స్‌ను నమోదు చేసి నెంబర్ వన్‌గా దూసుకెళ్లాడు. ఈ ఘనతతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బౌలర్ చేతి నుంచి బంతి రాగానే స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా ఆడే హిట్‌మ్యాన్, ఈ అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య రాంచీలో జరిగిన తొలి మ్యాచ్ ఈ రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మూడు భారీ సిక్స్‌లు బాది పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు. దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ ప్రెన్లన్ సుబ్రాయెన్ బౌలింగ్‌లో కౌ కార్నర్ మీదుగా భారీ స్లాగ్ స్వీప్‌తో తన 350వ వన్డే సిక్స్‌ను కొట్టాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Today Gold Price: సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా..!
ఫ్లెమింగో ఒంటి కాలి జపం కథేంటో తెలుసా..?
పొదుపుకు ఉత్తమ సూత్రం.. 50/30/20 రూల్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

