AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.కోట్ల ఆస్తులు.. ప్యాలెస్‌లను తలపించే బంగ్లాలు! నయన్ ప్రాపర్టీపై స్పెషల్ స్టోరీ

రూ.కోట్ల ఆస్తులు.. ప్యాలెస్‌లను తలపించే బంగ్లాలు! నయన్ ప్రాపర్టీపై స్పెషల్ స్టోరీ

Phani CH
|

Updated on: Aug 29, 2026 | 8:20 PM

Share

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సినిమాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. చెన్నై, హైదరాబాద్‌, కేరళలో ఆమెకు విలాసవంతమైన ఆస్తులు ఉన్నట్లు పబ్లిక్‌ రిపోర్టులు పేర్కొంటున్నాయి. చెన్నైలోని విలాసవంతమైన ఇల్లు, వీనస్‌ కాలనీలోని బంగ్లా-స్టూడియో, పోయెస్‌ గార్డెన్‌లోని భారీ డ్యూప్లెక్స్‌ ఆమె ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. నయనతార, విఘ్నేష్‌ శివన్‌ కలిసి కోట్ల విలువైన రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది.

నయనతార. హీరోయిన్‌లందరితో పోల్చితే ప్రత్యేక గుర్తింపును స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తన సంపాదనతోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చాలా ప్లాన్డ్‌గా సినిమాలు చేస్తూ.. కోట్లలో ఆస్తులను కూడేసింది. చెన్నై హోమ్‌ స్టూడియో టూ మన హైదరాబాద్‌ లోనూ కోట్లు విలువ చేసే ప్రాపర్టీని సొంతం చేసుకుంది.తన ప్రాపర్టీ సామ్రాజ్యంతో సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సామ్రాజ్యం ఏ పాటిది అనేది అప్పుడీ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లేడీ సూపర్‌స్టార్ నయనతార కేవలం సినిమాల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టారు. చెన్నై, హైదరాబాద్, కేరళ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆమెకు అత్యంత విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఐకానిక్ బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్లు, కేరళలో తిరువల్లలోని పూర్వీకుల ఇల్లు.. ఆమె రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్య భాగాలు. ఈ ఆస్తులన్నీ నయనతార రాయల్ లైఫ్‌స్టైల్‌ను, ఆమె వ్యాపార పరిజ్ఞానాన్ని చెప్పకనే చెబుతున్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్‌లకు భారతదేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో ఉంది. నయనతార ఆస్తుల్లో ప్రధాన భాగం చెన్నైలోనే ఉంది. 2021లో వీరు 16,500 చదరపు అడుగుల విశాలమైన 4-BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఇరుగుపొరుగుగా మారారు. ఈ ఇంటిలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, జిమ్, 1,500 చదరపు అడుగుల బాత్రూమ్ ఉన్నాయి. ఈ ఇల్లు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలోనూ చూపించారు. మార్చి 2025లో వీనస్ కాలనీలోని 7,000 చదరపు అడుగుల వలసవాద శైలి బంగ్లా-స్టూడియో వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 2025లో, పోయెస్ గార్డెన్‌లో రూ. 31.5 కోట్లకు 14,369 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా కలిగిన విలాసవంతమైన డ్యూప్లెక్స్‌ను కొనుగోలు చేశారు. పబ్లిక్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో నయనతారకు 90శాతం, విఘ్నేశ్‌కు 10శాతం వాటా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ లేడీ డైరెక్టర్ నుంచి సూర్య బతికిపోతే.. యశ్ దొరికేశాడు

బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఫైనల్‌ సెలబ్రిటీలు వీరే? లిస్ట్‌ చూస్తే మతిపోవడం పక్కా

Follow Us