Skin Tips: ఎండకు చర్మం నల్లబడుతోందా.. ఇంట్లోనే ఇలా చేయండి.!

Skin Tips: ఎండకు చర్మం నల్లబడుతోందా.. ఇంట్లోనే ఇలా చేయండి.!

Anil kumar poka

|

Updated on: Apr 15, 2024 | 8:02 AM

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటగానే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థిలు వచ్చేసాయి. ఎండలో ఎక్కువ సేపు గడపడం వల్ల చర్మం కందిపోతుంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇలా చర్మం కందిపోగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లను ఉపయోగిస్తుంటాం.

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటగానే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థిలు వచ్చేసాయి. ఎండలో ఎక్కువ సేపు గడపడం వల్ల చర్మం కందిపోతుంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇలా చర్మం కందిపోగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లను ఉపయోగిస్తుంటాం. అయితే ఎలాంటి క్రీమ్స్‌తో పనిలేకుండా సహజంగా కొన్ని టిప్స్‌ ద్వారా చర్మం మళ్లీ నిగనిగలాడేలా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దామా.? ఎండ వల్ల నల్లగా మారిన చర్మానికి బంగాళదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని బ్లీచింగ్ గుణాలు చర్మానికి పాత రంగును తీసుకొస్తాయి. బంగళాదుంప నుంచి రసాన్ని తీసుకోవాలి.

అనంతరం ఆ రసాన్ని ముఖానికి పట్టించి కొన్ని నిమిషాలు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చర్మం కాంతివంగా మారుతుంది. పచ్చి పాలు కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. అయితే పాలలో కాస్త బియ్యం పిండిని కలిపి కాసేపు అలాగే నానబెట్టాలి. అనంతరం ఆ పేస్ట్‌ను ముఖంపై, మెడపై రుద్ది బాగా మసాజ్‌ చేయాలి. కాసేపు ఇలా ఉంచిన తర్వాత నీటితో కడుక్కుంటే సరిపోతుంది. శనగపిండితో కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. శనగపిండిని తీసుకొని కొద్దిగా నీరు పోసి పేస్ట్‌లా తయారు చేయాలి. అనంతరం అందులో పసుపు వేసి ముఖానికి 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేసుకోవాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..