House on Moon:చందమామపై ఇల్లు కడదామా.? ఈ దశాబ్దంలోనే సాధ్యమన్న నాసా.. వీడియో.

|

Nov 28, 2022 | 8:49 AM

ఆ చందమామలో తేలిపోదామా హాయిహాయిగా అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తుంది.


సుదీర్ఘకాలం చంద్రునిపై నివసించడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడం కోసం మానవ రహిత ఓరియన్‌ అంతరిక్ష నౌకను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నౌక గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నాలుగున్నర లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. మరో 60 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రున్ని చేరుకున్నట్టే. ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా దానిని ప్రయోగించారు. చంద్రునిపై నివాసాల ఏర్పాటుకు అవసరమైన కీలక సమాచారాన్ని ఈ మిషన్‌ సేకరిస్తుందని మిషన్‌ అధికారి హోవార్డ్‌ హూ తెలిపారు. చంద్రధూళిని, సౌరశక్తిని ఉపయోగించి ఇటుకలను తయారు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో మనుషుల్ని చంద్రునిపైకి పంపించాలని అనుకొంటున్నట్టు ఆయన చెప్పారు. అయితే వారంతా శాస్త్రవేత్తలే అయి ఉంటారని ఆయన తెలిపారు. ఇది కేవలం అమెరికాను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది కాదని, ప్రపంచ దేశాలన్నీ ఇందులో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓరియన్‌ తరహా అంతరిక్ష నౌకల్లోనే మనుషుల్ని చంద్రునిపైకి చేరవేయాల్సి ఉంటుందని కూడా హోవార్డ్‌ హూ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..