Hyderabad: రికార్డు ధర పలికిన మైహోం భుజా గణపతి లడ్డూ
రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ భారీ ధర పలికింది. కొండపల్లి గణేశ్ అనే వ్యక్తి రూ. 51,77,777కు లడ్డూ దక్కించుకున్నాడు. గతేడాది ఇక్కడ లడ్డూ ధర రూ. 29 లక్షలు ఈ వ్యక్తే లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం.
హైదరాబాద్ మైహోం భుజా లడ్డూ ఈసారి తన రికార్డు ధరను అందుకుంది. వేలంలో లడ్డూకు 51 లక్షల 77 వేల 777 రూపాయల ధర పలికింది.
ఈ లడ్డూ కోసం జరిగిన వేలంల ఎంతో మంది పోటీ పడ్డారు. లడ్డూ వేలంలో గణేష్ అనే వ్యక్తి.. ఏకదంతుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ గత ఏడాది కూడా ఈ లడ్డూను విజయవంతంగా కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గత ఏడాది వేలంలో 29 లక్షలు పలికిన లడ్డూ ధర, ఈ సారి ఏకంగా 50 లక్షలు దాటడం విశేషం. ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్ తమ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సమాచారం.
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

