SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వ భద్రత.. కీలక పదవి దక్కనుందా..?
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వం భద్రత కల్పించింది. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో పలు విషయాలపై చర్చించారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత.. ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్‌మెన్లను కేటాయించింది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వం భద్రత కల్పించింది. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో పలు విషయాలపై చర్చించారు. సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత.. ఏపీ ప్రభుత్వం వర్మకు వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్‌మెన్లను కేటాయించింది. వర్మకు క్యాబినెట్ హోదా పదవి కోసం 2024 ఎన్నికల తర్వాత నుంచి అనుచరులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు గన్‌మెన్ల కేటాయింపుతో వర్మకు క్యాబినెట్ హోదా పదవి ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
కాగా.. గతంలో ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆయన అనుచరులు అనుకున్నారు.. అయినా.. సమీకరణాల వల్ల ఆయనకు పదవి వరించలేదు.. ఆ తర్వాత కీలక బాధ్యతలు దక్కుతాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే.. వర్మకు ఇద్దరు గన్‌మెన్లను కేటాయించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మకు కీలక పదవి దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది.. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

