నిర్లక్ష్యపు కాంట్రాక్టర్ కు చెత్తతో స్నానం… !! శివసేన ఎమ్మెల్యే హుకూం.. ( వీడియో )
ముంబైలో గత నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎటుచూసినా వ్యర్థాలు, మురుగు నీరే దర్శనమిస్తోంది.
ముంబైలో గత నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎటుచూసినా వ్యర్థాలు, మురుగు నీరే దర్శనమిస్తోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయని కాంట్రాక్టర్‌పై స్థానిక ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్‌ను చెత్తలో కూర్చోబెట్టి కాలువ వ్యర్థాలను మీద వేయించారు. డ్రైనేజీ క్లీన్ చేయలేదని కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే.. దిలీప్ లాండే అక్కడే ఉండి.. శివసేన కార్యకర్తలతో ఈ పనిని చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని చండీవాలి ప్రాంతంలో శనివారం ఈ సంఘటన జరిగింది
మరిన్ని ఇక్కడ చూడండి: Black Fungus: మనిషి మెదడులో చిన్ సైజులో బ్లాక్ ఫంగస్.. ఆపరేషన్ చేసి తొలగింపు.. ( వీడియో )
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
