Guntur: ఊపిరి తీసిన పరుగు.. కల తీరకుండానే కన్నుమూసిన యువకుడు..
ముప్పై రెండేళ్ల వయస్సు.. సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం.. ఇంకా పెళ్లి కాలేదు.. మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్నప్పటి నుండి తను కంటున్న కలను సాకారం చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో ఎంతో ఇష్టంగా కష్టపడ్డాడు. కానీ కాలం కలిసి రాలేదు. లక్ష్యం చేరకుండానే తుది శ్వాస విడిచాడు.గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన మోహన్ కుమార్‌కు చిన్నప్పటి నుండి పోలీస్ కావాలన్న కోరిక.
ముప్పై రెండేళ్ల వయస్సు.. సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం.. ఇంకా పెళ్లి కాలేదు.. మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్నప్పటి నుండి తను కంటున్న కలను సాకారం చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో ఎంతో ఇష్టంగా కష్టపడ్డాడు. కానీ కాలం కలిసి రాలేదు. లక్ష్యం చేరకుండానే తుది శ్వాస విడిచాడు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన మోహన్ కుమార్‌కు చిన్నప్పటి నుండి పోలీస్ కావాలన్న కోరిక. ఇంజనీరింగ్ పూర్తి చేసిన మోహన్ కుమార్ సచివాలయ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. వట్టి చెరుకూరు మండలం యామర్రు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మోహన్ కుమార్ తండ్రి ఆనారోగ్యంతో ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. తన ఒక్కగానొక్క చెల్లెలకు పెళ్లి చేశాడు. ఇక తల్లితో కలిసి జీవిస్తున్నాడు. వచ్చే రెండు నెలల్లో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మధ్యలోనే ఎస్సై ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది. దరఖాస్తు చేసుకున్న మోహన్ కుమార్ ఉద్యోగం చేస్తూనే రాత పరీక్షను సులభంగానే అధిగమించాడు. ఫిజికల్ టెస్ట్ ఉత్తీర్ణుడైతే ఇక తన కల నెరవేరినట్లే.. ఈ క్రమంలోనే తల్లికి చెప్పి ఇంటి నుండి ఎస్సై ఫిజికల్ టెస్ట్స్ జరుగుతున్న పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నాడు. పరుగు పందెం బరిలో నిలిచాడు. అయితే పరుగు పందెం పూర్తి కాకముందే కుప్పకూలిపోయాడు. పోలీసులు వెంటనే అతనికి సిపిఆర్ చేసి జిజిహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మోహన్ కుమార్ మరణంతో తల్లి పద్మ, సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

