మిస్ వరల్డ్ పోటీలు..హై అలర్ట్‌లో హైదరాబాద్ వీడియో
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 31 వరకు 28 రకాల ఈవెంట్స్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపు 150 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. 31న హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే ఉంటుంది.
భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ వేడుక ద్వారా తెలంగాణ సంస్కృతి, పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జంట నగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. మిస్ వరల్డ్ ఐపీఎల్ దృష్ట్యా సెక్యూరిటీ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు పోలీస్ కమిషనరేట్లలో ఇప్పుడు సీసీ కెమెరాల నిఘా ఉంది. కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.తాజా పరిణామాల నేపథ్యంలో అతిథులు బస చేసే ప్రదేశాల్లో సెక్యూరిటీని మరింత పెంచారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ లను నమ్మొద్దని పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో
బాంబులు పడతాయని భయం వేసింది వీడియో
ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
