వీడు ఎవడండీ బాబూ… 77 సార్లు 100కి కాల్ చేసిన తాగుబోతు వీడియో
తాగిన తర్వాత మనుషులు వివిధ రకాలుగా చేస్తారు. కానీ వీడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తాగిన తర్వాత నేరుగా పోలీసులతోనే పట్టుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 77 సార్లు 100 కి డయల్ చేసి పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్ పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేష్ అనే వ్యక్తి గత ఆరు నెలల్లో మద్యం మత్తులో 77 సార్లు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ డయల్ 100 కి కాల్ చేశాడు. అతను ప్రతిసారి వూరి పేరు తప్పు చెబుతూ తన పేరు వేరుగా చెబుతూ తాను చనిపోతున్నానని, భార్య కనిపించడం లేదని, తాను పెట్రోల్ పోసుకున్నానని ఇలా వివిధ అబద్ధాలతో పోలీసుల సేవలను దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ చర్యల వల్ల పోలీసులు అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత కొరకు ఏర్పాటు చేసిన డయల్ 100 సేవను అలా దుర్వినియోగం చేయడం నేరమని వారు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో
బాంబులు పడతాయని భయం వేసింది వీడియో
ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
