ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది
నక్కతోక తోకడం అంటే ఇదే కావచ్చు. ప్రకృతిని ఆస్వాదిద్దామని హైకింగ్ వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల పంట పండింది. వారికి అనుహ్యంగా కోట్లాది రూపాయల సంపద దొరికింది. చెక్రిపబ్లిక్ లోని ఈశాన్య పర్వతాల్లో ఈ సంఘటన వెలుగు చూసింది. చెక్రిపబ్లిక్ లోని పోర్కోర్గోనీసి పర్వతాల్లో ఇటీవల ఇద్దరు పర్యాటకులు హైకింగ్ కు వెళ్ళారు. అలా వారు ముందుకు వెళుతుండగా ఆ ప్రాంతంలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించాయి.
అంత మొత్తాన్ని అక్కడ చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ సంపద అంతా ఈస్ట్ బొహేమియాన్ మ్యూజియం లో ఉంది. ఫిబ్రవరి నెలలోని ఈ ఘటన వెలుగు చూసిన తాజాగా మ్యూజియం ఆ విషయాన్ని ఇప్పుడు వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న నాణేలు 1808 కాలం నాటివిగా గుర్తించినట్లు తెలిపింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్ సామ్రాజ్య కాలం నాటి ఆ నాణేలు 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితమే వాటిని భూమిలో దాచిపెట్టినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఆ విలువైన లోహాల ప్రారంభ విలువ 2.87 కోట్లుగా ఉండవచ్చని భావిస్తున్నారు. భూమిలో విలువైన వస్తువులను నిధుల రూపంలో నిల్వ చేయడం ప్రీహిస్టారిక్ సమయంలో ఒక ఆచారంగా ఉండేది. అనుచిత పరిస్థితులు నెలకొన్న సమయంలో దానిని భూమిలో దాచి తర్వాత వచ్చి దాన్ని తీసుకుందాం అనుకునే ఉద్దేశ్యం ఈ నిధి వెనుక కారణం కావచ్చు. అని మ్యూజియం అధికారులు వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు ఈ నిధిని దాచి ఉండవచ్చన్న వాదన ప్రచారంలో ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెల రోజులు రెగ్యులర్‌గా అల్లం తినండి.. జరిగింది చూసి మీరే షాకవుతారు
తనకంటే 6 ఏళ్ల చిన్నవాడితో హీరోయిన్ రొమాన్స్.. అడిగితే కంఫర్ట్ అంటూ ఆన్సర్
హీరో అజిత్ తల్లికి పాకిస్తాన్ తో ఏమిటి సంబంధం ??
కూర్చుంటే 2 బిర్యానీలు ఖతం !! యాంకరమ్మ పాత ఫోటోలు చూసి అందరూ షాక్

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
