Nizamabad: గంగమ్మకు బాగా మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్..
వలలో వేసిన ప్రతిసారీ మంచి చేపలు చిక్కాలని లేదు. పాపం కొన్నిసార్లు జాలర్లు నిరాశతోనే వెనుదిరుగుతూ ఉంటారు. అరుదుగా బాగా మంచి ఖరీదైన, బురువైన చేపలు చిక్కుతూ ఉంటాయి. ఇదిగో ఇక్కడి జాలర్లు బాగా గంగమ్మకు మొక్కి వల వేసినట్లు ఉన్నారు.
చెరువులు, రిజర్వాయిర్ల వద్ద చేపలు పట్టే జాలర్లకు అప్పుడప్పుడు భారీ పెద్ద సైజు చేపలు కూాడా చిక్కుతూ ఉంటాయ్. అలా 10, 20 కేజీల చేపలు వలలో పడ్డప్పుడు వాళ్ల సంబరం అంతా ఇంతా కాదు. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లాల ఎస్పారెస్పీ బ్యాక్ వాటర్స్‌లో ఇటీవల జాలర్లకు ఎంత పెద్ద చేప చిక్కిందో తెలిస్తే మీరు కూడా చేప లెక్క నోరు తెరవాల్సిందే.
ఇది మాములు పెద్ద చేప కాదండోయ్. నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం చిన్నాయనం ఊరవుతల ఎస్పారెస్పీ బ్యాక్ వాటర్స్‌లో వలకు చిక్కిందట ఈ భారీ చేప. తూకం వేస్తే 34 కిలోల బరువు ఉందట. దీంతో సంబరపడిపోతున్నాడు దాన్ని పట్టిన జాలర్లు. మరి ఇంత పెద్ద చేప వలలో చిక్కాక ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పండి. ఏదైనా ఫంక్షన్ ఉంటే.. ఈ ఒక్క చేప కోసి వండితే గెస్టులు అందరికీ వడ్డించేయవచ్చు. ఏదైనా చిన్నపాటి ఊరు జనం మొత్తానికి కూడా చేపల పులుసు వండి పెట్టొచ్చు. ఇది బొచ్చ చేప అని వారు చెబుతున్నారు.
ఐదు కిలోలు, పది కిలోలు, పదియేను కిలోల దాక పెరిగే బొచ్చె చేపలు ఇప్పటివరకు చూశాం కానీ.. 34 కిలోల చేపను చూడటం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు స్థానికులు. మరి ఈ చేప గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్పారెస్పీ బ్యాక్ వాటర్ల విడిచిన చేప పిల్లనా.. ఇప్పటి రేవంత్ ప్రభుత్వం వదిలిన చేప పిల్లనో తెలియదు కానీ.. దీన్ని చూస్తే మాత్రం ఇది అధికార, ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాదంటె మాదే ఈ పనితనం అని పేరుకోసం పంచాది పెట్టుకుంటారు అని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
