Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ట్రాక్టర్‌ను ముందుకు ఎవరైనా నడుపుతారు.. ఇదిగో ఇలా లైన్ దాటకుండా వెనక్కి నడపగలరా..?

Andhra: ట్రాక్టర్‌ను ముందుకు ఎవరైనా నడుపుతారు.. ఇదిగో ఇలా లైన్ దాటకుండా వెనక్కి నడపగలరా..?

Ram Naramaneni

|

Updated on: May 13, 2025 | 10:24 AM

బాపట్ల జిల్లా, చిన్నగంజాం మండలం, కడవకుదురులో గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరుణాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించారు . ట్రక్​తో ఉన్న ట్రాక్టర్ను.. తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెనక్కి తీసుకెళ్లిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి 5,116, రెండవ బహుమతి 3,116, మూడవ బహుమతి 2,116గా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు . పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు .

పల్లెటూర్లలో పండగలప్పుడు బరువులు ఎత్తడం, తాడు లాగడం, కొబ్బరికాయ విసరడం వంటి పందాలు నిర్వహిస్తూ ఉంటారు.  అలానే ఎడ్లతో బండలు లాగించడం, పరిగెత్తించడం వంటి పందేల చూస్తూ ఉంటాం. ఇక గుర్రాల రేసులు, బైక్ రేసులు, కార్ రేసులు.. కూడా టౌన్స్‌లో, సిటీల్లో చూస్తూ ఉంటాం. ఇలా పందేలు ఏవి చూసినా.. ముందుకు వెళ్లడమే టార్గెట్. బైక్స్, కార్ రేసింగ్స్ ఏవైనా.. ఆయా వాహనాలు మంచి కండీషన్‌లో ఉంటే ముందకు ఎవరైనా నడిపిస్తారు.. కానీ రివర్స్ నడపడం.. అదీ ఇచ్చిన లైన్ల మధ్య వేగంగా నడపడం అంటే అంత ఈజీ ఏం కాదు. దానికి అనుభవంతో పాటు మంచి స్కిల్ కూడా అవసరం. అందుకే ట్రాక్టర్లను రివర్స్ నడిపే పోటీలు పెట్టారు ఇక్కడి ఊరోళ్లు.

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురులో గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా ట్రాక్టర్ రివర్స్ డ్రైవింగ్ పోటీలు నిర్వహించారు. పోటీ రూల్స్ ఏంటంటే..  ముగ్గులతో గీసిన గీతలను దాటకుండా.. ఒక్క నిమిషంలో రివర్స్ ఎక్కువ దూరం ఎవ్వరు నడిపితే వాళ్లు గెలిచనట్లు లెక్క. విన్నర్స్‌కు ఫస్టు ప్రైజు రూ.5116, సెకండ్ ప్రైజు రూ.3116, తార్డ్ ప్రైజు రూ. 2116 పెట్టారు. దీంతో గ్రామంలోని డ్రైవర్లు  తెగ పోటీ పడ్డారు.

చాలామంది.. గీతలు తొక్కి ఔట్ అయిపోయారు. అతికొద్ది మంది మాత్రమే ఈ పోటీలో విజేతలుగా నిలిచారు. పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా ప్రతి ఏటా ఇలానే రివర్స్ డ్రైవింగ్ పోటీలు పెట్టి, ప్రైజులిస్తామని.. అక్కడి గుడి కమిటీవారు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..