Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇంటి అరుగు వద్ద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా.. వామ్మో...!

Andhra: ఇంటి అరుగు వద్ద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా.. వామ్మో…!

Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: May 13, 2025 | 12:30 PM

ఈ మధ్య ఉత్తరాంధ్ర ప్రాంతంలో కింగ్ కోబ్రాలు తెగ హల్ చల్ చేశాయి. ప్రస్తుతం వాటికి మేటింగ్ సీజన్ కావడంతో ఎక్కడ చూసినా మెలి వేసుకుని సంభోగంలో కనిపించాయి. ఈ తరహా వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. తాజాగా వి మాడుగులలో మరో కింగ్ కోబ్రా కలకలం రేపింది.

అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు భుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. వి మాడుగుల గణేష్ కాలనీలో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. చీపురుపల్లి వెంకటేష్ అనే ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. పొద్దుకూకిన తర్వాత బయట నుంచి ఇంటి నుంచి వస్తున్న సమయంలో పరిసరాల్లో ఏవో శబ్దాలు వినిపించాయి. చుట్టూ చూసిన ఏమీ కనిపించలేదు. కానీ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఇంటి గేటు సమీపాన ఆ శబ్దాలు మరింత గట్టిగా వినిపించాయి. బాగా వెతకగా.. బయట మురుగు కాల్వ మెట్ల వద్ద… ఏదో తారసలాడుతూ కనిపించింది. దీంతో టార్చ్ లైట్ వేసి చూడగా..  భారీ గిరి నాగు కనిపించింది. దీంతో భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత విషయాన్ని.. అటవీ శాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన.. వెంకటేష్.. పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. ఇంటి అరుగు కింద ఉన్న పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాము లోపల ఇరుక్కుని ఉన్నట్టు గుర్తించి శ్రమించాడు.. చివరకు గంటపాటు శ్రమించి.. కింగ్ కోబ్రాను పట్టుకొన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న కింగ్ కోబ్రాను అడవుల్లో విడిచిపెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

 

Published on: May 13, 2025 12:30 PM