Bottle stuck: భార్యకు భయపడి చెప్పని భర్త..  అక్కడ ఇరుక్కుపోయిన బాటిల్.. చివరకు..

Bottle stuck: భార్యకు భయపడి చెప్పని భర్త.. అక్కడ ఇరుక్కుపోయిన బాటిల్.. చివరకు..

Anil kumar poka

|

Updated on: Jul 24, 2022 | 9:18 AM

మలబద్ధకంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి సీటీ స్కాన్ తీసి షాకయ్యారు డాక్టర్లు. అతని మలద్వారంలో 19 సెంటీమీటర్ల వాటర్‌ బాటిల్‌ను గుర్తించి కంగుతిన్నారు. సీటీ స్కాన్ చేసే


మలబద్ధకంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి సీటీ స్కాన్ తీసి షాకయ్యారు డాక్టర్లు. అతని మలద్వారంలో 19 సెంటీమీటర్ల వాటర్‌ బాటిల్‌ను గుర్తించి కంగుతిన్నారు. సీటీ స్కాన్ చేసే వరకు ఏం జరిగిందో సదరు వ్యక్తి చెప్పకపోడంతో ఆశ్చర్యపోయారు.ఇరాన్‌లో ఆస్పత్రిలో చేరాడు ఓ 50 ఏళ్ళ వ్యక్తి. కొద్ది రోజులుగా మలబద్దకం, ఆకలి లేకపోవడం, తిమ్మిరి వంటి లక్షణాలు చూసి ఆందోళనతో ఆయన భార్య హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అయితే ఏం జరిగిందో అతను మాత్రం వైద్యులకు కూడా చెప్పలేదు. పరీక్ష నిర్వహించిన అనంతరం వైద్యులకు అసలు విషయం తెలిసింది. మలద్వారంలో వాటర్‌ బాటిల్ ఇరుక్కున్న విషయం తన భార్యకు చెబితే రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడే భర్త ఈ విషయాన్ని దాచినట్లు వైద్యులు చెప్పారు. చివరకు మలద్వారం నుంచి వాటర్ బాటిల్‌ను బయటకు తీశారు. మూడు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. అతని పెద్దపేగుకు, ఇతర అవయవాలకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అయితే బాధితుడు స్వయంగా తానే వాటర్ బాటిల్‌ను మలద్వారంలోకి ఇన్‌సర్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పొరపాటున ఇరుక్కు పోయి ఉంటుందని, లైంగిక సంతృప్తి కోసమే అతను ఇలా చేసి ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం అతడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు పంపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..