Viral Video: ఎయిరిండియా విమానం ఎలా కూలిందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
అహ్మదాబాద్‌లో విమానం కూలిన దుర్ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ టూ లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 1:17 గంటలకు అహ్మదాబాద్ నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. మేఘానీ ప్రాంతంలోని షాహీబాగ్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది బోయింగ్ – 787 డ్రీమ్ లైనర్ కాగా.. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ VT – ANBగా ఉంది. ప్రమాద సమయంలో 242మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ విమాన దుర్ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టేకాఫ్ అయిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్‌రూపానీ ఉన్నట్టు తెలుస్తోంది. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై విమానం కూలింది. సమాచారం అందుకోగానే అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రన్ వే తాత్కాలికంగా మూసివేశారు.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

