House Arrest: భర్తను ఎదిరించలేక 14 ఏళ్లు నరకం చూశాను.. బయట ప్రపంచం కొత్తగా ఉంది..

House Arrest: భర్తను ఎదిరించలేక 14 ఏళ్లు నరకం చూశాను.. బయట ప్రపంచం కొత్తగా ఉంది..

Anil kumar poka

|

Updated on: Mar 02, 2023 | 11:44 AM

అత్తవారింటి ఆంక్షలతో పన్నెండేళ్ల గృహ నిర్భంధం తరువాత భాహ్యప్రపంచంలోకి వచ్చింది ఓ మహిళ. నివాసం ఉంటున్న ఇల్లు తప్పా మరో లోకం తెలియని ఆ మహిళ పరిస్థితి అందరినీ కలచివేసింది.

తాళి కట్టిన భార్యను ఇంట్లో నిర్బంధించి బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు విజయనగరం జిల్లాకు చెందిన గోదావరి మధుసూదన్ అనే అడ్వకేట్ .. బయట ప్రపంచంతో పాటు కన్న తల్లిదండ్రులకు కూడా దూరం చేశాడు ఆ ప్రబుద్ధుడు.. అత్తారింటి వేధింపులతో పధ్నాలుగేళ్ళు ఏళ్ల పాటు దుర్భరమైన జీవితాన్ని అనుభవించి చిక్కి శల్యమైంది సుప్రియ అనే మహిళ.. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ ను విజయనగరం టౌన్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి, తమ్ముడు దుర్గాప్రసాద్ తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్ళైన తరువాత మూడు ఏళ్లు బాగానే ఉన్న భర్త, అత్తలు ఆ తరువాత ఆంక్షలు పెట్టి సుప్రియ కు నరకం చూపించడం ప్రారంభించారు. సూటిపోటి మాటలతో వేధించేవారు..ఎమ్ ఎ లిటరేచర్ వంటి ఉన్నత విద్య అభ్యసించిన సుప్రియను ఇంటికే పరిమితo చేసి అష్టకష్టాలు పెట్టారు.. సుప్రియ ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా బంధించారు.. ఫోన్ కూడా ఇవ్వకుండా ఎవరితో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు.. సుప్రియ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ప్రాధేయపడ్డ ఫలితం ఉండేది కాదు. అలా ఇంట్లో మనుషులు తప్పా మరో లోకం తెలియకుండా పన్నెండు ఏళ్లు గడిచాయి.. చివరికి తల్లిదండ్రుల చూపుకు కానీ, నోటి మాటకు కానీ నోచుకోకుండా భాధలు అనుభవించింది.. ఇంట్లో ఇంటి పనులు చేసుకొనే పనిమనిషి అవతారమెత్తింది.. అత్త పెట్టిందే తింటూ కాలం గడిపింది.. అత్త పెట్టే చాలీ చాలని భోజనంతో ఆకలితో అవస్థలు పడేది..

Published on: Mar 02, 2023 11:44 AM