AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాస్టిక్‌తో పెనుముప్పు.. సంచలన రిపోర్ట్ విడుదల

ప్లాస్టిక్‌తో పెనుముప్పు.. సంచలన రిపోర్ట్ విడుదల

Phani CH
|

Updated on: Aug 11, 2025 | 7:01 PM

Share

ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఇప్పటివరకు కేవలం పర్యావరణ సమస్యగానే చూస్తున్నాం. కానీ, ఇది మానవ ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించిన సంక్షోభమని ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక 'ది లాన్సెట్' సంచలన నివేదికను విడుదల చేసింది. ప్లాస్టిక్ నియంత్రణపై ఐక్యరాజ్యసమితి కీలక చర్చలకు సిద్ధమవుతున్న వేళ, ఈ సమస్యను ఆరోగ్య కోణంలో చూడాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే 2019తో పోలిస్తే 2060 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగే ప్రమాదం ఉందని నివేదిక అంచనా వేసింది. ఇప్పటికే సుమారు ఎనిమిది బిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ విచ్ఛిన్నం కాగా వెలువడే మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్ సముద్రపు లోతుల నుంచి మానవ కణజాలం వరకు ప్రతిచోటా వ్యాపించాయని పరిశోధకులు గుర్తించారు. ప్లాస్టిక్ దాని జీవితచక్రంలోని ప్రతి దశలోనూ ఆరోగ్యానికి హాని కలిగిస్తోందని లాన్సెట్ నివేదిక స్పష్టం చేసింది. ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల నుంచి వెలువడే పీఎం 2.5 వంటి సూక్ష్మ ధూళి కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌ల వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొంది. అంతేకాకుండా, ప్లాస్టిక్‌లో వాడే ఎండోక్రైన్ డిస్రప్టర్ల వంటి రసాయనాలు మానవ శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి రోగనిరోధక శక్తిని తగ్గించడం, పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం కావడం వంటి తీవ్రమైన ప్రభావాలు చూపుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోందని హెచ్చరించింది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్లాస్టిక్‌లో వినియోగించే వేలాది రసాయనాలలో 75 శాతం వాటి భద్రతపై ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు జరగలేదని నివేదిక వెల్లడించింది. ఇప్పటికే మానవ రక్తం, కణజాలాల్లోకి చేరిన మైక్రోప్లాస్టిక్ కణాలు గుండె జబ్బులు, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ దిశగా మరింత పరిశోధన జరగాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రమాదాన్ని నివారించడం అసాధ్యమేమీ కాదని, ప్రభుత్వాలు కఠినమైన అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకుని, ప్లాస్టిక్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తే ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని నివేదిక పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడి మట్టిలో నీరుందా? తాజా పరిశోధన ఏం చెప్పింది?

ఏది కొనాలన్నా.. దాన్నే అడుగుతున్న ఇండియన్స్‌..

వంటింటి సింక్‌లో వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..

పాపం ఫస్ట్ టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైయ్యారుగా

సరదా అనుకున్నారు.. చావు దెబ్బ తిన్నారు.. పావురాలతో ఆటలా