వంటింటి సింక్‌లో వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..
సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో, ఓ ఇంట్లోని కిచెన్‌లో సింక్‌లో కొన్ని కడగాల్సిన పాత్రలున్నాయి. అయితే..ఆ సింక్ లో నుంచి ఏదో సౌండ్ రావటంతో ..ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళ వంటింటిలోని సింక్ వద్దకు వచ్చి చూసింది.అంతే.. అక్కడి సీన్ చూసి ఒక్క క్షణం పాటు షాకైంది. సింకులోని పాత్రల మధ్య 4 అడుగుల పొడవున్న పాము.. ఎలుకను చుట్టుకొని ఉంది.
దీంతో..పాము కదిలిన ప్రతిసారీ పాత్రలు కదులుతున్నాయని అర్థమై.. భయంతో వంటగది నుండి బయటకు పరిగెత్తి.. భర్తకు ఫోన్ చేసింది. తర్వాత ఇంటికొచ్చిన భర్తతో కలిసి ఆమె తన మొబైల్‌లో ఈ సీనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్‌గా మారిన ఆ వీడియో చూసిన నెటిజన్లు భయంతో..తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. దంపతుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.అది రాట్ స్నేక్ అని, విషపూరితమైనది కాదని, ఇది సాధారణంగా ఎలుకలు, చిన్న కీటకాలను తింటుందని స్నేక్ క్యాచర్ తెలిపారు. ఇది వర్షాకాలంలో మురుగు కాలువలు, పైపులైన్లు లేదా చెత్త కుప్పల ద్వారా పట్టణ ప్రాంతపు ఇళ్లలోకి దూరుతుందని, ఆ పాము వంటగది పైపు ద్వారా సింక్‌లోనికు చేరుకుని ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం ఫస్ట్ టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైయ్యారుగా
సరదా అనుకున్నారు.. చావు దెబ్బ తిన్నారు.. పావురాలతో ఆటలా
చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా.. పక్కకు తీసి చూడగా షాక్
గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం యువకుడి చందాలు.. ఏంటి మామా నీకు ఈ ఖర్మ
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

