పాపం ఫస్ట్ టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైయ్యారుగా
దొంగతనం చేయడంలోనూ అనుభవం ఉండాలి.. లేదంటే అడ్డంగా బుక్కై కటకటాల పాలవ్వాల్సిందే..! ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులు అక్కడి నుండి తప్పించుకోవడం కోసం పడ్డ తాపత్రయం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే..! ఇంతకీ ఆ దొంగలు ఏం చేశారు..? ఎలా దొరికిపోయారో తెలుసా..? మీరే చూడండి..
ములుగు మీదుగా భూపాలపల్లికి వెళ్తున్న క్రమంలో జే.డీ మల్లంపల్లి వద్ద రోడ్డు పక్కన ఒక లారీ పార్కింగ్ చేసి ఉంది.. లారీ పరిసరాల్లో ఎవరు కనిపించకపోవడంతో కక్కుర్తి పడ్డారు.. ఆ లారీ బ్యాటరీని దొంగిలించారు. దొంగిలించిన ఆ బ్యాటరీని వారి బైక్ పై పెట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించారు.. ఈ క్రమంలో అక్కడే ఉన్న గ్రామస్తులు, మరి కొందరు లారీ డ్రైవర్లు కలిసి ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఇంకేముంది.. అడ్డంగా బుక్కైన ఆ దొంగలు బోరుమన్నారు.. దొంగతనం ఫస్ట్ టైం.. బుద్ధి గడ్డి తిని బ్యాటరీ దొంగలించామని లారీ డ్రైవర్ కాళ్ళ మీద పడి వేడుకున్నారు.. గ్రామస్తులు పోలీసులకు పట్టించడానికి ప్రయత్నాలు చేయగా..వారినీ ఇలాగే ప్రాధేయపడ్డారు. కాగా, ఈ దొంగలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలానికి చెందిన వారిగా గ్రామస్తులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సరదా అనుకున్నారు.. చావు దెబ్బ తిన్నారు.. పావురాలతో ఆటలా
చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా.. పక్కకు తీసి చూడగా షాక్
గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం యువకుడి చందాలు.. ఏంటి మామా నీకు ఈ ఖర్మ
పొరపాటున గూగుల్‌లో ఈ విషయాలపై సెర్చ్ చేస్తే.. సీదా జైలుకే
వింతఘటన.. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందా..? వింతను చూసేందుకు ఎగబడ్డ జనం
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

