దీప్తి మృతి కేసులో కీలక పురోగతి.. పోలీసులు అదుపులో చందన, ఆమె స్నేహితుడు
హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్ కోసం దీప్తి తల్లిదండ్రులు వెళ్లారు. చెల్లెలు చందనతో కలిసి దీప్తి ఇంట్లో ఉంది. పేరెంట్స్ ఫోన్ చేస్తే చందన ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీప్తి ఫోన్ ఎత్తలేదు. దీంతో పక్కింటివాళ్లకు సమాచారం అందిస్తే వాళ్లు వెళ్లి చూసేసరికి దీప్తి చనిపోయి కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కోరుట్లకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న దీప్తిని చూసి భోరుమన్నారు. అయితే చందన...ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకువెళ్లినట్లు తెలిసింది.
దీప్తి మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఆమె మరణానికి కారణాలు తెలియడం లేదు. అయితే కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీప్తి చెల్లెలు చందన ఆమె స్నేహితుడిని ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చందనపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చందన స్నేహితుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు ఇంట్లో ఉన్న బంగారం, నగదు కూడా తీసుకుని పారిపోయింది చందన. దీప్తి పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే డెత్ మిస్టరీ వీడే అవకాశం ఉంది. ఇక చందన ఆచూకీ లభించడంతో దీప్తి మరణానికి కారణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపింది. అయితే పోస్టుమార్టం రిపోర్టు రావడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందంటున్నారు. దీప్తి మృతదేహంపై గాయాలు ఉన్నాయని ప్రాథమిక పోస్టుమార్టంలో తేలింది. ఇక పోలీసులు నాలుగు రోజులుగా చందన ఆచూకీ కనిపెట్టలేకపోవడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా చందన ఆచూకి సంపాదించి కీలక పురోగతి సాధించారు పోలీసులు.
దీప్తి మంగళవారం ఉదయం అనుమానస్పద స్థితిలో చనిపోయింది. హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్ కోసం దీప్తి తల్లిదండ్రులు వెళ్లారు. చెల్లెలు చందనతో కలిసి దీప్తి ఇంట్లో ఉంది. పేరెంట్స్ ఫోన్ చేస్తే చందన ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీప్తి ఫోన్ ఎత్తలేదు. దీంతో పక్కింటివాళ్లకు సమాచారం అందిస్తే వాళ్లు వెళ్లి చూసేసరికి దీప్తి చనిపోయి కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కోరుట్లకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న దీప్తిని చూసి భోరుమన్నారు. అయితే చందన…ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఓ స్నేహితుడితో కలిసి ప్లాన్ ప్రకారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది చందన. దీంతో పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.