Infosys CEO Salary: సీఈవో జీతాన్ని భారీగా పెంచిన ఇన్ఫోసిస్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Infosys CEO Salary: సీఈవో జీతాన్ని భారీగా పెంచిన ఇన్ఫోసిస్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Anil kumar poka

|

Updated on: Jun 03, 2022 | 9:38 AM

భారతీయులు ప్రపంచవ్యాప్త పలు ప్రఖ్యాత కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. అద్భుతమైన సారధ్యబాధ్యతలతో కంపెనీల ఎదుగుదలకు తోడ్పాటునందిస్తూ కళ్లు చెదిరే జీతాలు అందుకుంటున్నారు. సాధారణంగా ఓ సీఈఓ సాలరీ ఎంతుంటుంది?


భారతీయులు ప్రపంచవ్యాప్త పలు ప్రఖ్యాత కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. అద్భుతమైన సారధ్యబాధ్యతలతో కంపెనీల ఎదుగుదలకు తోడ్పాటునందిస్తూ కళ్లు చెదిరే జీతాలు అందుకుంటున్నారు. సాధారణంగా ఓ సీఈఓ సాలరీ ఎంతుంటుంది? 5 లక్షలు మొదలు కొని దాదాపు 10 కోట్లుంటుందనుకుంటాం.. కానీ ఓ సీఈఓ ఏకంగా 71 కోట్ల సాలరీ పొందుతున్నాడు.. అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న భారతీయ కంపెనీ సీఈవో ఎవరు? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? ఓ లుక్కేద్ధాం.. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ వేతనం భారీగా పెరిగింది. కంపెనీ సమర్పించిన వార్షిక రిపోర్టులో 2021-22 ఆర్థిక సంవత్సరంలో సలీల్ పరేఖ్ పరిహారాలు మొత్తంగా 43 శాతం పెరిగి రూ.71 కోట్లకు చేరుకున్నట్టు ఇన్ఫోసిస్ గురువారం వెల్లడించింది. గతేడాది పరేఖ్ అందుకున్న స్టాక్ ప్రోత్సాహకాలతో పరేఖ్ ఆదాయం భారీగా పెరిగింది. అంతేకాక ఆయన పనితీరు ఆధారంగా చెల్లించే వేరియబుల్ చెల్లింపు కూడా పెరిగినట్టు కంపెనీ తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ నమోదు వృద్ధి కారణంగా సీఈవోకు భారీ మెుత్తంలో జీతభత్యాలను అందిస్తోంది. జూలై 1, 2022 నుంచి మార్చి 31, 2027 వరకు.. అంటే 5 ఏళ్ల కాలానికి ఇన్ఫోసిస్‌లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తిరిగి నియమితులైన కొద్ది రోజులకే పరేఖ్ పరిహారాన్ని కంపెనీ పెంచింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉంది.

ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సలీల్ పరేఖ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 71 కోట్ల రూపాయల జీతం అందుకున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 2020-21లో 49 కోట్ల 68 లక్షల రూపాయలపై దాదాపు 43 శాతం మేర ఆయన జీతం పెరిగింది. ఈ మెుత్తంలో 52 కోట్ల 33 లక్షల రూపాయలు పెర్క్విసిట్‌లలో స్టాక్ ఆప్షన్‌లు, 5కోట్ల 69లక్షలు స్థిర వేతనం, రిటైర్‌మెంట్ ప్రయోజనాల రూపంలో 38 లక్షలు సహా వేరియబుల్ పేగా 12 కోట్ల 62 లక్షల రూపాయలను పరేఖ్ అందుకుంటున్నారు. పరేఖ్ జనవరి 2018 నుంచి ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 03, 2022 09:38 AM