Health Tips: పల్లీలతో ఇన్ని లాభాలా.. బాబోయ్.. గుండె వ్యాధులకు చెక్!(Video)
పల్లీలకు పేదవాడి కాజుగా పేరు. అంటే జీడిపప్పు కొని తినే స్తోమత లేని వారు పల్లీలు తింటే సరిపోతుందని ఒక నానుడి. కానీ ఈ పల్లీలు పేదవాడికే కాదు అందరికీ ఉపయోగకరమే అంటున్నారు పరిశోధకులు. ఈ పల్లీలతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చట.. అదెలాగో చూద్దాం.
పల్లీలుగా పిలవబడే వేరుశెనగలు గుండెజబ్జులను దూరం చేస్తాయట. జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. వేరుశెనగలు అధికంగా తినే ఆసియా ప్రజలు గుండె జబ్బుల ప్రమాదం నుంచి దూరంగా ఉంటారని పరిశోధనల్లో తేలిందట. జపాన్‌లో నివసిస్తున్న ఆసియా మహిళలు, పురుషులు రోజూ వేరుశెనగలు తినటం వల్ల వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Published on: Sep 14, 2021 09:35 AM
వైరల్ వీడియోలు
Latest Videos