AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acne Creams: మొటిమలకోసం క్రీమ్స్‌ వాడుతున్నారా? జాగ్రత్త..! నిపుణుల సూచన.

Acne Creams: మొటిమలకోసం క్రీమ్స్‌ వాడుతున్నారా? జాగ్రత్త..! నిపుణుల సూచన.

Anil kumar poka
|

Updated on: Mar 22, 2024 | 12:54 PM

Share

ముఖంపై మచ్చలు, మొటిమలు పోవడానికి చాలామంది రకరకాల క్రీమ్స్‌ వాడుతుంటారు. వీటిపై నిపుణులు కీలక హెచ్చరిక చేస్తున్నారు. అవును మొటిమల కోసం ఉపయోగించే బెంజాయిల్ పెరాక్సైడ్ ఆధారిత క్రీమ్‌లు, జెల్స్, వాష్‌లను ముందుగా ఫ్రిడ్జ్‌లో చల్లబరిచాక వాడాలని అమెరికాలోని డెర్మటాలజిస్టుల అసోసియేషన్ ఒకటి తాజాగా సూచించింది. ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక బెంజీన్ రసాయన అవశేషాలు ఉన్నందువలన వీటిని నిషేధించాలంటూ..

ముఖంపై మచ్చలు, మొటిమలు పోవడానికి చాలామంది రకరకాల క్రీమ్స్‌ వాడుతుంటారు. వీటిపై నిపుణులు కీలక హెచ్చరిక చేస్తున్నారు. అవును మొటిమల కోసం ఉపయోగించే
బెంజాయిల్ పెరాక్సైడ్ ఆధారిత క్రీమ్‌లు, జెల్స్, వాష్‌లను ముందుగా ఫ్రిడ్జ్‌లో చల్లబరిచాక వాడాలని అమెరికాలోని డెర్మటాలజిస్టుల అసోసియేషన్ ఒకటి తాజాగా సూచించింది. ఈ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక బెంజీన్ రసాయన అవశేషాలు ఉన్నందువలన వీటిని నిషేధించాలంటూ స్వతంత్ర క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ వెలీషూర్ సూచించింది. ఈ మేరకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు మొటిమల క్రీములను ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలని సూచించారు. ఇలా చేస్తే క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావం చాలా వరకూ తగ్గుతుందని అమెరికా ఆక్నే, రోసాసియా సొసైటీ AARS బుధవారం ఓ ప్రకటన చేసింది. వెలీషూర్ పరీక్షల ఫలితాలు తమను ఒకింత ఆశ్చర్యపరిచాయని AARS అధ్యక్షుడు జేమ్స్ డెల్ రోసో వ్యాఖ్యానించారు. గత ఐదు దశాబ్దాలుగా ఈ ట్రీట్‌మెంట్ ఉనికిలో ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు మరింత పరిశోధన జరగాలన్నారు. మొటిమలు, ఇతర చర్మసంబంధిత సమస్యల చికిత్సలో బెంజాయిల్ పెరాక్సైడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని AARS పేర్కొంది. మరోవైపు, వెలీషూర్ ల్యాబ్ పిటిషన్‌పై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ స్పందించింది. వెలీషూర్ సమాచారాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అమెరికాలోని ప్రముఖ బ్రాండ్స్ ప్రొయాక్టివ్, క్లియరాసిల్‌పై స్టెబిలిటీ పరీక్షలు నిర్వహించగా వాటిల్లోని బెంజీన్ కంటెంట్ పెరిగినట్టు వెలీషూర్ ల్యాబ్ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..