తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్.. ఎప్పటి నుంచంటే ??

|

Mar 06, 2024 | 12:28 PM

తెలంగాణలో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ చివరిలో, మేలో మొదలవ్వాల్సిన ఎండలు ఇప్పటినుంచే స్టార్ అవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే క్లాసులు జరగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు.

తెలంగాణలో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ చివరిలో, మేలో మొదలవ్వాల్సిన ఎండలు ఇప్పటినుంచే స్టార్ అవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే క్లాసులు జరగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ పెట్టి, ఆ తర్వాత సమ్మర్ హాలీడేస్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షా కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం ఎగ్జామ్ నిర్వహించి, మధ్యాహ్నం పిల్లలకు క్లాసులు చెప్పనున్నారు. విద్యార్థుల లంచ్ అనంతరం టీచర్లు క్లాసులు నిర్వహిస్తారు. టెన్త్ ఎగ్జామ్స్ పూర్తయిన తరువాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Katrina Kaif: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రీనా ఎందుకలా చేసింది ??

Mahesh Babu: ఇదికదా కిక్ అంటే !! జక్కన్న మూవీలో 8 గెటప్స్‌లో మహేష్‌

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్.. రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…

Samantha: అల్లు అర్జున్‌ ఓ యాక్టింగ్ బీస్ట్‌

Rajinikanth: సినిమాల్లో నీతులు చెప్తే సరిపోదు సార్.. రజినీకాంత్‌పై దారుణ ట్రోల్స్‌

Follow us on