బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు.. వారిని ఆపి చెక్ చేయగా.!
తెనాలిలో అడ్డగోలుగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు టూ-టౌన్ పోలీసులు. వారంతా తునిలో గంజాయిను కొనుగోలు చేసి.. వాటిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి స్థానికంగా ఉన్న రద్దీ ప్రదేశాల్లో..
తెనాలిలో అడ్డగోలుగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు టూ-టౌన్ పోలీసులు. వారంతా తునిలో గంజాయిను కొనుగోలు చేసి.. వాటిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి స్థానికంగా ఉన్న రద్దీ ప్రదేశాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని సభ్యులను కొల్లిపర మండలం వల్లభాపురంకు చెందిన పాముల రుషి బాబు, తూమాటి శ్యాం కుమార్, మండ్రు రాజ్ కుమార్, మల్లోల శోభన్ బాబుగా గుర్తించారు. వీరంతా కూడా చెడు వ్యసనాలకు బానిసలై.. ఈజీ మనీ కోసం ఆశపడి ఇలాంటి తప్పుదోవను ఎంచుకున్నారని సీఐ తెలిపారు.
వీరంతా తుని నుంచి ఒక కేజీ గంజాయిని రూ. 5 వేల చొప్పున 2 కేజీలు కొనుగోలు చేసి, దానిని 20 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి వాటిని 200 రూపాయలకు తెనాలిలోని రైల్వే స్టేషన్ ఏరియా, బస్ స్టాండ్ ఏరియాతో పాటు తెనాలి చుట్టపక్కల ప్రాంతాల్లో అమ్ముతూ డబ్బులు సంపాందించేవారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఈ నలుగురు దొంగిలించిన మోటార్ సైకిళ్ళతో గంజాయి అమ్మేందుకు తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు రాగానే పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రెండు కేజీల గంజాయి, దొంగలించిన నాలుగు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

