Golden Blood Group: అత్యంత అరుదైన గోల్డెన్ బ్లడ్ గ్రూప్… ఈ బ్లడ్ గ్రూప్ ఇక్కడ తెలుసుకోండి… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 28, 2021 | 10:34 PM

ఎవరైనా మిమ్మల్ని అరుదైన బ్లడ్ గ్రూప్ ఏది అని అడిగితే వెంటనే.. 'బాంబే బ్లడ్' గ్రూప్ అని చెప్పేస్తారు. దాదాపుగా అందరికీ తెల్సిన విషయం ఇది.

ఎవరైనా మిమ్మల్ని అరుదైన బ్లడ్ గ్రూప్ ఏది అని అడిగితే వెంటనే.. ‘బాంబే బ్లడ్’ గ్రూప్ అని చెప్పేస్తారు. దాదాపుగా అందరికీ తెల్సిన విషయం ఇది. కానీ, దానికంటే అరుదైన బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. అదే ‘గోల్డెన్ బ్లడ్’ గ్రూప్. మనకు బాగా తెలిసిన బ్లడ్ గ్రూప్ లు ఏ, బీ, ఏబీ, ఓ మాత్రమే. ఈ అరుదైన గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్‌ నల్(Rh null). క్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. ‘ఏ’ గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. ‘బీ’ గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ రెండూ ఉండవు. అలాగే, ఎర్ర రక్త కణాలు 61 Rh- రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Rare Pearl Cone: వలలోకి చిక్కిన అరుదైన శంఖం…!! కొనేందుకు పోటీపడ్డ వ్యాపారులు… ( వీడియో )

Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్… ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి… ( వీడియో )