వామ్మో బామ్మ.. తొమ్మిది పదుల వయస్సులో కూడా యోగాసనాలు.. ఆదర్శంగా నిలుస్తోన్న బామ్మ.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 22, 2021 | 11:38 PM

శరీరాన్ని విల్లులా వంచుతూ క్లిష్ట ఆసనాలు, కఠోర వ్యాయామాలు అవలీలగా చేస్తూ అబ్బురపరుస్తోంది ఎనభై తొమ్మిది సంవత్సరాల బామ్మ జీరురు కనక లక్ష్మి .పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన...

శరీరాన్ని విల్లులా వంచుతూ క్లిష్ట ఆసనాలు, కఠోర వ్యాయామాలు అవలీలగా చేస్తూ అబ్బురపరుస్తోంది ఎనభై తొమ్మిది సంవత్సరాల బామ్మ జీరురు కనక లక్ష్మి .పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జీగురు కనకలక్ష్మి గత 30 ఏళ్లుగా నిత్యం తెల్లవారు జామున 4 గంటలకే యోగాసనాలు వేస్తుంటారు. తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వైద్యుల సూచనల మేరకు అరవైయ్యేళ్ల వయసులో యోగా నేర్చుకున్నారు. ఈమెను ఊళ్లో అందరూ యోగా బామ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. చిన్నతనంలో అంబలి, గట్కా, వ్యవసాయ పనులు వెళ్లడం వల్లే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి వేళలో పండ్లు, అల్పాహారం తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యం అంటారు బామ్మ.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Meet SpaceBok: మార్స్‌పైకి నాలుగు కాళ్ల రోబో… ఈ రోబో ఏం చేస్తుందో తెలుసా..?? ( వీడియో )

Kakinada: కాకినాడ మత్స్యకారుడి వలలో చిక్కిన ఖరీదు చేసే చేప… ( వీడియో )