దేశంలో మొదటి టెస్లా కారు డెలివరీ ఎవరు కొన్నారంటే? వీడియో
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా భారత్ లో తన మొదటి కారును తాజాగా డెలివరీ చేసింది. పూర్తి తెలుపు రంగులో ఉన్న ఈ వై మోడల్ ఎలక్ట్రిక్ కారు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సరనాథ్ కొనుగోలు చేశారు. అయిన ఈ కారును తన మనవడికి కానుకగా ఇవ్వనున్నట్లు తెలిపారు. టెస్లా జులై 15వ తేదీన ముంబైలోనే బికెసిలో మొదటి షోరూమ్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు 600 బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది. అయితే మొదటి కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ కొనుగోలు చేశారు. దీంతో సెప్టెంబర్ 5వ తేదీన ముంబైలోని టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రతినిధులు మంత్రి ప్రతాప్ కు ఆ కారును డెలివరీ చేసి తాళాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలి టెస్లా కారును కొన్నందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. తను ఈ కారు కొనుగోలు కోసం ఎలాంటి డిస్కౌంట్ తీసుకోలేదని పూర్తి మొత్తం చెల్లించినట్లు చెప్పారు. దీనిని తన మనవడికి కానుకగా ఇవ్వనున్నానని ఇందులో కూర్చుని స్కూల్ కు వెళ్లి అందరికీ పర్యావరణ అనుకూల వాహనాల గురించి సందేశాన్ని ఇస్తానని తెలిపారు. పర్యావరణ హితమైన వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తను ఈ వాహనాన్ని కొనుగోలు చేశానని మంత్రి చెప్పారు. రానున్న పదేళ్లలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి రావాలని చెప్పారు. తమ ప్రభుత్వం కూడా వీలైనంత వరకు పర్యావరణ అనుకూల కార్లను ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని టోల్ బూత్ ల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు డిస్కౌంట్లు ఇస్తుందని అన్నారు. అలాగే ఆటోమొబైల్ కంపెనీలు కూడా వినియోగదారులకు ప్రతిచోటా చార్జింగ్ సౌకర్యాలను అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో
పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో
ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో
బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
