AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో

Samatha J
|

Updated on: Sep 03, 2025 | 10:15 PM

Share

సాధారణంగా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ వద్దకు వెళ్ళగానే మొదట చేసేది బ్లడ్ టెస్టే. మానవ శరీరంలో బ్లడ్ ని టెస్ట్ చేయడం ద్వారా అనేక వ్యాధులను గుర్తించడం సులభం అవుతుంది. అయితే వైద్యులు బ్లడ్ టెస్ట్ రాయగానే చాలా మంది కంగారుపడతారు. అందులో ఏం బయటపడుతుందో అని కూడా ఆందోళనకు గురవుతారు. అయితే వైద్యులు చేయించే కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష మనిషి ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సిబిసి టెస్ట్ ఒక స్కోర్ కార్డ్ లాంటిది.

రక్తంలో హిమోగ్లోబిన్ చాలా ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ని మోసుకెళ్లి శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. సాధారణంగా పురుషుల్లో దీని స్థాయి 13 టు 17 గ్రాం పర్ డెసిలీటర్, మహిళల్లో 12 టు 15 గ్రాం పర్ డెసిలీటర్ మధ్య ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు రక్తహీనతకు గురవుతారు. దీనివల్ల తీవ్రమైన నీరసం, ఆయాసం, పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనతకు ముఖ్య కారణం ఐరన్, విటమిన్ బి 12 లోపించినప్పుడు రక్తహీనత వస్తుంది. రిపోర్టులో ఎంసివి, ఎంసిహెచ్, ఎంసిహెచ్సి వంటి విలువలు ఎర్ర రక్త కణాల పరిమాణం, వాటిలో హిమోగ్లోబిన్ సాంద్రతను సూచిస్తాయి. వీటి ఆధారంగానే రక్తహీనత ఏ కారణం చేత వచ్చిందో వైద్యులు నిర్ధారిస్తారు. ఇక హెమటోక్రిట్ రక్తంలో ఎర్ర రక్త కణాల శాతాన్ని తెలియజేస్తుంది. ఇది తగ్గిన రక్తహీనతగా పరిగణిస్తారు. ఇక మన శరీరంలో తెల్ల రక్త కణాలు ముఖ్యమైనవి. ఇవి ప్రమాదకర ఇన్ఫెక్షన్లు, బాక్టీరియా, వైరస్ లతో పోరాడతాయి. సాధారణంగా వీటి సంఖ్య 4000 నుంచి 11000 సెల్స్ పర్ మైక్రో లీటర్ వరకు ఉంటుంది. శరీరంలో ఏదైనా వైరస్ చేరితే ఇవి వాటితో పోరాడేందుకు రెడీ అవుతాయి. జ్వరం, ఇన్ఫ్లమేషన్ ఉంటే డబ్ల్యుబిసి కౌంట్ ఎక్కువగా కనిపిస్తుంది. వైరల్ జ్వరాలు, టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చినప్పుడు, అలాగే కొన్ని రకాల మందులు వాడినప్పుడు తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణ స్థాయి కంటే తగ్గిపోతుంది.

మరిన్ని వీడియోల కోసం :

చైనా కారులో మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ కారు వీడియో

డ్రెయిన్‌లో పడిన దివ్యాంగుడు.. ఏం జరిగిందంటే? వీడియో

భర్త కళ్లలో కారం కొట్టి హత్య… కారణం ఇదే వీడియో