డ్రెయిన్‌లో పడిన దివ్యాంగుడు.. ఏం జరిగిందంటే? వీడియో
అసలే ఇది వర్షాకాలం మ్యాన్ హోల్స్ తెరుచుకుని ఉంటాయి. ఎక్కడ ఏ గుంత ఉందో ఎప్పుడు ఏ రోడ్డు కుంగుతుందో తెలియని పరిస్థితి అలర్ట్ గా లేకుంటే అమాంతం మింగేస్తాయి. గతంలో జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యం. ఢిల్లీలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
సుభాష్ పార్క్ ప్రాంతంలో సంతోష్ యాదవ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు నివసిస్తున్నాడు. అయితే పిల్లలు బర్గర్ కావాలని అడగడంతో తీసుకు వచ్చేందుకు సంతోష్ ఇందిరాపురం లోని షాప్ కు వెళ్ళాడు. అక్కడ బర్గర్లు కొన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు తన స్కూటర్ ను రివర్స్ చేశాడు. అయితే ఆ వెనకాలే డ్రైన్ ఓపెన్ చేసి ఉండడాన్ని సంతోష్ గమనించలేదు. దీంతో అతని స్కూటర్ వెనక్కి తీస్తున్న క్రమంలో వెనక టైర్ అమాంతం డ్రైన్ గుంతలో జారుకుంది. దీంతో సంతోష్ కూడా స్కూటర్ తో సహా ఆ డ్రైన్ గుంతలో పడిపోయాడు. అయితే ఆ గుంత ఎక్కువ లోతుగా ఉండడంతో అతను బయటకు వచ్చేందుకు కుదరలేదు. అది గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చేతితో లాగేందుకు రాకపోవడంతో నిచ్చెన అతనికి అందించారు. దీంతో సంతోష్ నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కాడు. తర్వాత తాళ్ల సహాయంతో అతని వాహనాన్ని కూడా బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో దివ్యాంగుడైన సంతోష్ కు స్వల్పగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఢిల్లీ మున్సిపాలిటీ నిర్లక్ష్యం స్పష్టమైందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కోళ్లగూడులో ఊహించని సీన్.. భయంతో పరుగులు తీసిన రైతు వీడియో
పాముకి చుక్కలు చూపించిన పిల్లి.. చివరికి వీడియో
విడాకులిచ్చిన భార్యకు షాక్.. భర్తకు జాక్‌పాట్.. ఏం జరిగిందట వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
