AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోళ్లగూడులో ఊహించని సీన్‌.. భయంతో పరుగులు తీసిన రైతు వీడియో

కోళ్లగూడులో ఊహించని సీన్‌.. భయంతో పరుగులు తీసిన రైతు వీడియో

Samatha J
|

Updated on: Sep 01, 2025 | 6:54 PM

Share

గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఇళ్లల్లో కోళ్లను పెంచుకుంటూ ఉంటారు. గుడ్ల ద్వారా వాటిని అమ్మడం ద్వారా కొంత ఆదాయం వస్తుందని ఇళ్లల్లోనే చిన్నగా గూడును ఏర్పాటు చేసి పెంచుతుంటారు. అలా ఒక రైతు తన ఇంటి ఆవరణలో కోళ్లను పెంచుకుంటున్నాడు. పగలంతా బయట తిరిగి సాయంత్రం కాగానే ఇంటికి చేరుకున్న కోళ్లను గూడులో వేసి తలుపు వేశాడు. మరునాడు ఉదయం కోళ్లను బయటకు వదులుదామని వెళ్లి కోళ్ల గూడును తలుపు తీశాడు. అందులో కోళ్లు చనిపోయి ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతను కోళ్ల గూడిలో కూర్చున్న నాగుపామును చూసి దిగ్భ్రాంతితో వణికిపోయాడు. భయంతో పరుగులు తీశాడు.

విజయనగరం జిల్లా ఏసీ కోట మండలం బొడ్డవర పంచాయతీ భవాని నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశ్ అనే రైతు తన ఇంట్లో కోళ్లను పెంచుకున్నాడు. అలా పెంచే క్రమంలో సాయంత్రం కోళ్లను పట్టుకొని గూడులో వేసి తాళం వేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కోళ్ల గూడిలోకి ఒక పెద్ద నాగుపాము ప్రవేశించి రెండు కోళ్లను కాటు వేసింది. కోళ్లు పెట్టిన కోడిగుడ్లను కూడా మింగేసింది. ఎప్పటిలాగే ఉదయం కోళ్లను బయటకు వదలడానికి వెళ్ళిన అతనికి గూడిలో ఉన్న తన కోళ్లు చనిపోయి కనిపించాయి. ఆ ఘటన చూసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలపై పరిశీలించగా పాము కాటేసినట్లుగా గమనించారు. అయితే కోళ్లను కాటేసిన పాము ఇంకా తన ఇంటి పరిసరాల్లోనే ఉంటుందని గుర్తించిన రైతు ప్రకాశ్ వెంటనే చుట్టుపక్కల వారిని అలర్ట్ చేశాడు. అలాగే స్థానిక స్నేక్ కాచర్ పెంటకోట సూర్యబాబుకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న స్నేక్ కాచర్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. పామును పట్టుకునే క్రమంలో అది స్నేక్ కాచర్ కు ముప్పతిప్పలు పెట్టింది. ఇల్లంతా కలియతిరుగుతూ అందరినీ హడలెత్తించింది. కొంతసేపటి తర్వాతే ఎట్టకేలకు చాకచక్యంగా నాగుపామును పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మీ పిల్లలకు ఆట బొమ్మలు ఇస్తున్నారా?అయితే తస్మాత్‌ జాగ్రత్త!

ఎయిర్‌షోలో షాక్‌..అగ్నిగోళంగా యుద్ధ విమానం.. ఫైలెట్ మృతి!

మోసపోయి.. పిచ్చివాడిలా మారి.. భిక్షాటన చేస్తూ 13 ఏళ్లకు వీడియో

దారిచ్చే సముద్రం చూసారా? ఏటా రెండుసార్లు.. ఎక్కడంటే వీడియో