AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి మందిని చంపుతాం..నిమజ్జనం వేళ ఉగ్ర బెదిరింపు వీడియో

కోటి మందిని చంపుతాం..నిమజ్జనం వేళ ఉగ్ర బెదిరింపు వీడియో

Samatha J
|

Updated on: Sep 07, 2025 | 9:32 PM

Share

వినాయక నిమజ్జనం ముందు ముంబైలో మానవ బాంబులు ప్రవేశించారంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహానగరంలో 14 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని 34 వాహనాల్లో మానవ బాంబులు వేరువేరు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారని మెయిల్లో చెప్పారు.

400 కిలోల ఆర్డీఎక్స్ తో పేలుళ్లు జరుపుతారని బెదిరింపు మెయిల్ సారాంశమని తెలిపారు. ఆర్డీఎక్స్ తో కోట్లాది మందిని చంపుతామని దుండగులు మెసేజ్ లో బెదిరించినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. లష్కరే జిహాదీ వాట్సాప్ నెంబర్ నుంచి మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. పాకిస్థాన్ కు చెందిన జిహాద్ గ్రూప్ సభ్యులంటూ ఒక వ్యక్తి మెయిల్స్ పంపాడని అధికారులు చెప్పారు. దీంతో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు ముంబై మహానగరంలో బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో

పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో

ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో

Published on: Sep 07, 2025 06:43 PM