AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాక్షసుల్లా మారిన తల్లిదండ్రులు! ఏం చేసారంటే వీడియో

రాక్షసుల్లా మారిన తల్లిదండ్రులు! ఏం చేసారంటే వీడియో

Samatha J
|

Updated on: Sep 07, 2025 | 6:35 PM

Share

అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో అత్యంత దారుణంగా ప్రవర్తించారు. రాక్షసుల్లా మారి కన్నబిడ్డల్ని బంధించి హింసించారు. చివరకు పాపం పండి ఆ తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే పెన్సిల్వేనియాకు చెందిన 65 ఏళ్ల జేమ్స్ కాల్, 41 ఏళ్ల కార్లీ కాల్ భార్యాభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఐదుగురి వయసు 5 నుంచి 14 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది.

జేమ్స్, కార్లీ సైకోలుగా మారిపోయారు. కన్నబిడ్డల్ని ఇంటికింద బేస్మెంట్లో ఉండే గదిలో బంధించారు. ఆ గది చాలా భయంకరంగా ఉంది. అందులో పడుకోవడానికి బెడ్స్ లేవు. మలమూత్ర విసర్జనకు కూడా ఏర్పాట్లు లేవు. దీంతో గది మొత్తం పిల్లల విసర్జనలతో నిండిపోయి దుర్వాసన వచ్చింది. దానికి తోడు ఆ గదిలో భారీ స్థాయిలో నల్లులు కూడా ఉన్నాయి. పాపం ఆ పిల్లలు ప్రతిరోజు నరకం చూశారు. బయటకు పంపమని తల్లిదండ్రుల్ని వేడుకున్నారు. అయినా వారి మనసు కరగలేదు. కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే గది తలుపు తెరిచేవారు. తర్వాత వెంటనే మూసేసేవారు. ఆ ఐదుగురు పిల్లలు తప్పించుకోవడానికి ఎలాంటి మార్గం లేకుండా పోయింది. నాలుగు గోడల మధ్య ఐదుగురు అల్లాడిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంటికి వెళ్లారు. బేస్మెంట్ గదిలోని పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. వారిని ప్రొటెక్టివ్ కస్టడీలో ఉంచారు. తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో

పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో

ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో