AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

Phani CH
|

Updated on: May 28, 2026 | 1:01 PM

Share

పోలాండ్‌లో పనిచేస్తున్న ఓ భారతీయుడు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూరప్‌లో సాయంత్రం 5 తర్వాతే అసలైన జీవితం మొదలవుతుందని, కుటుంబం, వ్యక్తిగత ప్రశాంతతకు అక్కడ ఎక్కువ విలువ ఇస్తారని అతను తెలిపాడు. ఎప్పుడూ బిజీగా ఉండటమే విజయం కాదని, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌నే నిజమైన సక్సెస్‌గా యూరప్ నేర్పించిందని చెప్పడంతో ఈ వీడియో చర్చనీయాంశమైంది.

పోలాండ్‌లో నివసిస్తున్న ఓ భారతీయుడు షేర్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు భారత వర్క్‌ కల్చర్‌పై చర్చకు దారితీసింది. యూరప్‌లో వర్క్ చేయడం తన జీవిత దృక్పథాన్ని, ముఖ్యంగా కెరీర్ సక్సెస్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చేసిందని అతను వివరించాడు. సాయంత్రం 5 గంటల తర్వాతే అసలైన జీవితం ఉంటుందని తెలుసుకోవడమే తనకు ఎదురైన అతిపెద్ద కల్చర్‌ షాక్ అని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూరప్ వర్క్ కల్చర్ గురించి ఆ వ్యక్తి ఇంట్రెస్టింగ్‌ విషయాలు పంచుకున్నాడు. యూరప్‌లో పనిచేసే భారతీయులకు జీతం లేదా పనిగంటల కంటే పెద్ద షాక్ మరొకటి ఉంది. అదేంటంటే.. ఇక్కడ జీవితంలో పనే ముఖ్యం కాదు అనే నిజం తెలుసుకోవడం” అని అతను చెప్పాడు. ఆఫీసు సమయం ముగిశాక తమ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడానికి అక్కడి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉంటారని, ఆఫీసులో ఓవర్ టైమ్ డ్యూటీ చేయడాన్ని, లేదా ఎప్పుడూ బిజీగా కనిపించడాన్ని గొప్పగా చూడరని తెలిపాడు. చాలా మంది తమ వ్యక్తిగత ప్రశాంతత, కుటుంబ సమయానికి విలువ ఇచ్చి ప్రమోషన్లను కూడా తిరస్కరిస్తారని చెప్పాడు. కుటుంబంతో కలిసి తినే డిన్నర్లు, ఆహ్లాదకర సాయంత్రాలు, నిజమైన సెలవుల్లా అనిపించే వారాంతాలు.. అవే అసలైన విజయవంతమైన జీవితం అనే కొత్త అర్థాన్ని తనకు నేర్పించాయని తెలిపాడు. . “ఎప్పుడూ బిజీగా ఉండటమే విజయం అనే భావనను యూరప్ మార్చేసింది” అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.వీడియోపై నెటిజన్ల నుంచి మిక్స్డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న చాలా మంది అతని అభిప్రాయంతో ఏకీభవించారు. అయితే, ఈ అనుభవాలు పరిశ్రమను బట్టి మారవచ్చని కొందరు కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐ హెడ్‌గేర్‌తో గంటకు రూ.350 కూరగాయలు అమ్మే కుర్రాడి అదనపు సంపాదన

‘స్టార్ హీరో అనే అపోహే లేవకుండా కిందపడేసింది!

నాగార్జున.. నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది.. ఐలవ్యూ చెప్పాడు..

Follow Us