AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మళ్లీ మోదీనే నెంబర్‌ 1.. అత్యంత ప్రజాకర్షక నేతగా నరేంద్రమోదీ.

PM Modi: మళ్లీ మోదీనే నెంబర్‌ 1.. అత్యంత ప్రజాకర్షక నేతగా నరేంద్రమోదీ.

Anil kumar poka
|

Updated on: Sep 17, 2023 | 4:21 PM

Share

ఇటీవల భారత్ లో నిర్వహించిన జీ20 సదస్సు అంచనాలకు మించి విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ పేరుప్రతిష్ఠలు మరింత ఇనుమడించాయి. కరోనా సంక్షోభం వేళ భారత్ ను నడిపించిన తీరు ప్రపంచ దేశాధినేతల మధ్య మోదీకి ప్రత్యేక స్థానం కల్పించింది. జీ20 సదస్సుతో ఆయన ఛరిష్మా ఉవ్వెత్తున ఎగిసింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గతంలో నిర్వహంచిన పలు సర్వేల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

ఇటీవల భారత్ లో నిర్వహించిన జీ20 సదస్సు అంచనాలకు మించి విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ పేరుప్రతిష్ఠలు మరింత ఇనుమడించాయి. కరోనా సంక్షోభం వేళ భారత్ ను నడిపించిన తీరు ప్రపంచ దేశాధినేతల మధ్య మోదీకి ప్రత్యేక స్థానం కల్పించింది. జీ20 సదస్సుతో ఆయన ఛరిష్మా ఉవ్వెత్తున ఎగిసింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గతంలో నిర్వహంచిన పలు సర్వేల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో మోదీ హవా స్పష్టంగా కనిపించింది. ప్రపంచలోనే అత్యంత ప్రజాకర్షక నేతగా మోదీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఓ సర్వే నిర్వహించగా, మోదీ నాయకత్వానికి అత్యధికంగా 76 శాతం మంది జై కొట్టారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలాయిన్ బెర్సెట్ ఉన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మోదీకి, రెండో స్థానంలో ఉన్న బెర్సెట్ కు మధ్య 12 పాయింట్ల తేడా ఉంది. గత కొన్నేళ్లుగా, ప్రపంచ ప్రజాదరణ కలిగిన నేతల జాబితాల్లో మోదీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడో స్థానంలో ఉన్నారు. సర్వేలో ఆయనకు 40 శాతం మంది మద్దతు పలికారు. సెప్టెంబరు 6 నుంచి 12 తేదీల మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఇక, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అత్యధికులు తిరస్కరించారు. ఆయనకు వ్యతిరేకంగా 58 శాతం మంది ఓటేశారు. తిరస్కరణ విషయానికొస్తే మోదీకి వ్యతిరేకంగా 18 శాతం మంది మాత్రమే ఓటేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow Us