Hyderabad: పాతబస్తీలో పోలింగ్ శాతం పెంచేందుకు యువకుల వినూత్న ప్రయత్నం

Hyderabad: పాతబస్తీలో పోలింగ్ శాతం పెంచేందుకు యువకుల వినూత్న ప్రయత్నం

Janardhan Veluru

|

Updated on: May 13, 2024 | 5:38 PM

పాతబస్తీలో పోలింగ్ శాతం పెంచేందుకు యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. కొందరు యువకులు ఇంటింటికి వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో అత్యల్ప పోలింగ్‌ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గం.ల వరకు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కేవలం 29.47 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది

పాతబస్తీలో పోలింగ్ శాతం పెంచేందుకు యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. కొందరు యువకులు ఇంటింటికి వెళ్లి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో అత్యల్ప పోలింగ్‌ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గం.ల వరకు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కేవలం 29.47 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. హైదరాబాద్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో పాతబస్తీ యువకులు ఇంటింటిని టచ్ చేస్తూ.. ఓటింగ్‌ పర్సంటేజీ పెంచేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.