Hyderabad: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ.! వీడియో..
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. రకరకాల పద్ధతులను ఉపయోగించి టన్నెల్ డ్రిల్లింగ్ చేశారు. మధ్య మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నిటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరికి 41మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీం.
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. రకరకాల పద్ధతులను ఉపయోగించి టన్నెల్ డ్రిల్లింగ్ చేశారు. మధ్య మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నిటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరికి 41మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీం. ఇందులో హైదరాబాద్‌కు చెందిన బోరోలెక్స్ ఇండ్రస్ట్రీస్ కీలకపాత్ర పోషించింది. ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు నవంబర్ 25న హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని సంప్రదించారు.
టన్నెల్‌లో చిక్కుకున్న అగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని కట్ చేసే విషయమై సలహా అందించాలని వారు డాక్టర్ సతీష్ రెడ్డిని కోరారు. ఈ నేపధ్యంలో ఆయన ఇందుకు ఉపయోగపడే పరికరాల కోసం స్థానిక పరిశ్రమలను సంప్రదించారు. బెరోలెక్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇందుకు ప్లాస్మా ఆధారిత కట్టింగ్‌ను సూచించారు. తరువాత 800 ఎం.ఎం. పైపులైన్ వ్యాసం కంటే తక్కువ వ్యాసం కలిగిన యంత్రాల కోసం పలువురిని సంప్రదించారు. ఒక పరిశ్రమలో అలాంటి రెండు యంత్రాలు ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ యంత్రాలతోపాటు ఇద్దరు కట్టింగ్ నిపుణులను ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సంఘటనా స్థలానికి పంపించింది. నవంబరు 25న సంఘటనా స్థలానికి చేరుకున్న వారు కొద్ది గంటల సమయంలోనే టన్నెల్‌లో అడ్డుపడిన అగర్ యంత్రం బ్లేడ్‌లను కట్ చేయడం ప్రారంభించారు. తద్వారా ఇతర యంత్రాల ద్వారా డ్రిల్లింగ్‌కు అనువైన పరిస్థితులు కల్పించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు భాస్కర్ కుల్బే తదితరులు టన్నెల్ సహాయక చర్యల్లో చేయూతనందించిన బెరోలెక్స్ ఇండస్ట్రీస్ శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.