AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్‌.. హైదరాబాదీ  ఆవేదన!

భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్‌.. హైదరాబాదీ ఆవేదన!

Phani CH
|

Updated on: Sep 25, 2026 | 10:20 PM

Share

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త జితేంద్ర ఎమ్మాని భారత పాస్‌పోర్ట్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. విదేశీ ప్రయాణాలకు వీసా, భారీ డాక్యుమెంటేషన్‌, వేచి ఉండాల్సిన పరిస్థితులను ఆయన ప్రశ్నించారు. ఏటా రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తనకు ప్రత్యేక ప్రయోజనాలు కనిపించడం లేదని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. అమెరికా వీసా ఉంటే కొన్ని దేశాలకు ప్రయాణం సులభమవుతుందని చెబుతూ, భారత పాస్‌పోర్ట్‌ అంతర్జాతీయ మొబిలిటీపై ప్రశ్నలు లేవనెత్తారు.

“భారత పాస్‌పోర్ట్ పరమ చెత్తది” అంటూ హైదరాబాద్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త, CozyFarms.in వ్యవస్థాపకుడు జితేంద్ర ఇమ్మాని ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నా పౌరులకు కనీస ప్రయోజనాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ ప్రయాణాల కోసం భారత పాస్‌పోర్ట్‌దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లాలంటే వీసా కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని లేదా వందల పేజీల డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే దేశాలకు సులభంగా వెళ్లేందుకు భారత పాస్‌పోర్ట్ కంటే అమెరికా వీసానే షార్ట్‌కట్‌లా పనిచేస్తోందని, అలాంటప్పుడు మన పాస్‌పోర్ట్ హోల్డర్లకు మరో విదేశీ వీసా ఎందుకు అవసరమవుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఏటా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు చెల్లిస్తున్నప్పటికీ, దేశీయంగా లేదా అంతర్జాతీయంగా తనకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు దక్కడం లేదని వాపోయారు. ఇలాంటి ప్రయాణ ఆంక్షలు, వ్యవస్థాగత ఇబ్బందుల వల్లే ప్రతిభావంతులైన భారతీయులు వేరే దేశాల పౌరసత్వం వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన జితేంద్ర చేసిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం భారత పాస్‌పోర్ట్ విలువ గతంతో పోలిస్తే ఎంతో మెరుగైందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ పోస్ట్ ఇప్పుడు పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త

వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు

చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..

‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!

Follow Us