సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ భారీ కొండచిలువ మనకు ఎదురైతే ఇంకేమైనా ఉందా.! గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక అన్నవరం గ్రామ సమీపంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టు, పంపానది గేట్లు, మిస్సమ్మ కొండపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండపై ఉన్న స్థానికులు, యువకులు భారీ కొండచిలువను గుర్తించి స్థానిక ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. నీటిపారుదల సంబంధించిన సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. కొండచిలువను బంధించి చాకచక్యంగా పట్టుకున్నాడు అటవీశాఖ స్నేక్ క్యాచర్. దీంతో అప్పటిదాకా భయభ్రాంతులకు గురైన స్థానికులు.. హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొండచిలువను సురక్షితమైన ప్రదేశంలో వదిలేశాడు స్నేక్ క్యాచర్. కొండచిలువను స్థానికుల్లో పలువురు యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.