గృహిణి సేవలు ఆర్థిక కోణంలో చూడొద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఇంటిపని, వంటపని చేస్తూ సమయానికి కుటుంబానికి ఏం కావాలో అది అందిస్తూ చక్కగా ఇంటిని నిర్వహించే భార్య సేవలు వెలకట్టలేనివని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని పేర్కొంది. ఓ యాక్సిడెంట్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 2006లో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి బీమా సౌకర్యం లేకపోవడంతో వాహన యజమాని ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది.
ఇంటిపని, వంటపని చేస్తూ సమయానికి కుటుంబానికి ఏం కావాలో అది అందిస్తూ చక్కగా ఇంటిని నిర్వహించే భార్య సేవలు వెలకట్టలేనివని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని పేర్కొంది. ఓ యాక్సిడెంట్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 2006లో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి బీమా సౌకర్యం లేకపోవడంతో వాహన యజమాని ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. కేసును విచారించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ మృతురాలి కుటుంబానికి రెండున్నర లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు 2017లో కొట్టివేసింది. మహిళ గృహిణి కాబట్టి ఆమె ఆదాయం పరిమితమని, కాబట్టి ఆమెకు ఇవ్వాల్సిన పరిహారం ఫిక్స్‌డ్‌గా ఉంటుందని, కనీస ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించడం సబబేనని తేల్చి చెప్పింది. హైకోర్టును తీర్పును బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. గృహిణి సేవలను తక్కువగా అంచనా వేయడం సరికాదని, ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి పనులు చక్కబెట్టే ఆమె సేవలను ఆర్థిక కోణంలో చూడటం తగదని, ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆమె ఏమీ తక్కువ కాదని పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాటిళ్లతో టైం బాంబులు.. ఆర్డర్ చేసిన మహిళ అరెస్టు
ఏటీఎంలో చోరీ.. లక్షలు దోచేసిన కేటుగాళ్లు..
ఎగురుతున్న విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

