తాజ్‌మహల్‌ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..

చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై భారత పురావస్తు శాఖ క్లారిటీ ఇచ్చింది.

Phani CH

|

Jul 05, 2022 | 7:37 PM


చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై భారత పురావస్తు శాఖ క్లారిటీ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తాజ్‌ మహల్‌లో దేవతా విగ్రహాలు ఉన్నాయన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. తాజ్‌ మహల్‌ నేలమాళిగల్లో మూసి ఉన్న గదులు కానీ, హిందూ దేవతల విగ్రహాలు కానీ లేవని పురావస్తుశాఖ క్లారిటీ ఇచ్చింది. తాజ్‌మహల్‌ నేలమాళిగలో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. అందులో మూసి ఉన్న 22 గదులను తెరవాలని.. అయోధ్య బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి డా.రజనీశ్‌ కుమార్‌ 2022, మే 7న అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఆ గదులు తెరిచేలా ఏఎస్‌ఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. కాగా ధర్మాసనం దీనిని తోసిపుచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి సాకేత్‌ గోఖలే.. జూన్‌ 21న సమాచార హక్కు చట్టం కింద పురావస్తు శాఖవారిని కొన్ని ప్రశ్నలు అడిగారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కోడి మామూలుది కాదురోయ్‌..యాక్టింగ్‌లో ఆస్కార్‌ పక్కా..

ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే

కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu